నచ్చేసావే పిల్లా నచ్చేసావే
నచ్చేసావే పిల్లా నచ్చేసావే
ఆకాశం ఉన్నా లేకున్నా
నీకోసం ఎపుడు నేనుంటా
ఆ వెన్నెల ఉన్నా రాకున్నా
నీ కంటికి వెలుగై నేనుంటా
చిరుగాలి సెలవంటూ
లోకాన్నే వదిలేస్తే
నీ గుండెకు ఊపిరినై
నీ వెంటే ఉంటాలే
ఈ నేలకు వయసుడిగి
తుది శ్వాస విడిచేస్తే
నీ అడుగుకి మడుగునినై
నీ భారం మోస్తాలే చెలి అనార్కలీ
నచ్చేసావే పిల్లా నచ్చేసావే
నచ్చేసావే పిల్లా నచ్చేసావే
గుచ్చేసావే పిల్లా గుచ్చేసావే
నవ్వు బాణం తోటి నన్ను గుచ్చేసావే
అలసిపోయి సూరీడు
రాజీనామ రాసిస్తే
ప్రతి రోజు నీకోసం ప్రకాశమై
నేను ఉదయిస్తానే
అలకభూని నెలవంక
అమావాస్య ప్రకటిస్తే
జామురేయి జాబిలినై
నా ఒడిలో నిను లాలిస్తా
హరివిల్లు హరి అంటూ
పరలోకం పారిపోతే
సరికొత్త రంగులతో
నవలోకం సృస్టిస్తా
ఈ భూమిపై పువులన్నీ
వసి వాడి రాలిపోతే
నా ఉసురే కుసుమంలా
నీ కురులకు అందిస్తా చెలి అనార్కలీ
నచ్చేసావే పిల్లా నచ్చేసావే
నచ్చేసావే పిల్లా నచ్చేసావే
దోచేసావే పిల్లా దోచేసావే
చూపు గాలం వేసి ప్రాణం దోచేసావే
కలత చెంది నీ కనులు
కునుకు రాక కూర్చుంటే
కలకాలం నీకు కావలినై
నీ కలలను పండిస్తా
పరచినాను నా హృదయం
తివాచీలా నీ కోసం
వేలు పట్టి ప్రతి అడుగు
నిన్ను పసిపాపల్లె నడిపిస్తా
అనురాగం పలికించే
అధునాతన రాగంతో
ఆనందం హోరెత్తే
సంగీతం వినిపిస్తా
ఆ బ్రాహ్మణు బ్రతిమాలి
విధిరాతే సవరించి
ప్రతి జన్మకు నీ జతగా
నీ కోసం జన్మిస్తా చెలి అనార్కలీ
నచ్చేసావే పిల్లా నచ్చేసావే
నచ్చేసావే పిల్లా నచ్చేసావే
నెట్టేసావే పిల్ల నెట్టేసావే
ప్రేమ మైకంలోకి నన్ను నెట్టేసావే
______________________
సాంగ్ : నచ్చేసావే పిల్లా నచ్చేసావే (Nachesave Pilla Nachesave)
ఆల్బమ్/సినిమా: మెకానిక్ (Mechanic)
నటీనటులు : మణి సాయి తేజ (Mani sai Teja), రేఖ నిరోష (Rekha Nirosha),
గాయకుడు: సిద్ శ్రీరామ్ (Sid Sriram)
సంగీత దర్శకుడు: యజమాన్య (Yajamanya)
లిరిక్స్ : ముని సహకర (Muni Sahekara)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.