కలలు కన్న మారాణి
కళ్ళ ముందుకొచ్చిందియ్యలా..
రెక్కలే కట్టుకొని ఎగిరినాది పాణం మబ్బుల్లా ..
చూసి నన్ను బాగున్నావని ప్రేమగా మందలిస్తుందో
చూసి కూడా గుర్తుకు లేదని మళ్ళి చూడ కుండా పోతుందో
దాసుకున్న నీ బొమ్మనే గుండె లోపల..
కిల కిల నవ్వులలో రామ చక్కని చిలకమ్మవే
గుండె మీద వాలిపోయే ఒక్కసారి నీ కొరకు చుస్తున్నానే
నీలాల నీ కళ్ళలో చూసుకున్నాను నా బొమ్మనే
ఒక్కసారి కళ్ళ నన్ను చూసిపోయే నీ వెంట వస్తున్ననే
రోజు నిన్ను తలుచుకున్న ఆశలెన్నో పెంచుకున్న
పేరు నీది గుండెలపైనపచ్చబొట్టు వేసుకున్న
నా ప్రేమ నీ మీదనే సీతమ్మ నీ తోడు నేనైతనే
నా గీత దాటేళ్లకే సీతమ్మ నీ రాముడై వస్తానే
నీ కాలి గజ్జ సప్పుడయ్యి మోగుతుందే నా గుండె సప్పుడు
నా గుండెకే పాణమయ్యి ఉండరదే నాతో ఇప్పుడు
నీ కంటికే కట్టుకయ్యి అంటుకొన ఎప్పుడు
నీ ఒంటికి చీర లెక్కనే చుట్టుకోవే నన్ను ఇప్పుడు
నువ్వు నాకు ఇష్టమైన చెప్పలేక నోసుతున్న
గువ్వ ఎట్లా చెప్పనే నీకు గాయి గాయి అయితున్న నేను
నా ప్రేమ నీ మీదనే సీతమ్మ నీ తోడు నేనైతనే
నా గీత దాటేళ్లకే సీతమ్మ నీ రాముడై వస్తానే
సంకురాత్రి ముగ్గులేసుకుంటా సందమామ లెక్క కుసుంటే
చక్కదనము చూసి చంటిగాడి గుండెకాయ లొల్లిపెట్టినాదే
అచ్చమైన పల్లెటూరి పిల్ల అందమంటే గిట్లవుంటాదంటూ
నిన్ను చేసినాక తేలిసినాదే బొమ్మ అచ్చుగుద్ది పోయినావే
నువ్వు ఒప్పుకుంటే కట్టుకుంటా రాణిలెక్క చూసుకుంటా
కండ్ల నీరు తెల్వకుండా కంటి పాప లెక్క దాచుకుంటా
నా ప్రేమ నీ మీదనే సీతమ్మ నీ తోడు నేనైతనే
నా గీత దాటేళ్లకే సీతమ్మ నీ రాముడై వస్తానే
_______________
Song Credits:
తారాగణం :- రసూల్ ప్రిన్స్(Rasool Prince), స్నేహ శర్మ (Sneha Sharma)
స్క్రీన్ ప్లే & దర్శకత్వం :- కిర్రాక్ నాని (Kirrak Nani)
నిర్మాత :– సర్దార్ (Sardar)
సంగీతం :- హనీ గణేష్ (Honey Ganesh)
కొరియోగ్రఫీ :- శిశాంత్ (Shishaanth)
గాయకుడు :– అజయ్ మెంగాని (Ajay Mengani)
లిరిక్స్ & ట్యూన్:– రాజు తాడూరి (Raju Thaduri)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.