నా హృదయం ఎరుగదు ఇదివరకు .. ఈ ప్రియ సరిగమలే
నా మనసుకు తెలియదు ఇదివరకు .. ఈ కసి గుసగుసలే
ఇది ఏమో ఏదో ఎరుగనులే .. అయినా మధురములే
ఇది కలయా నిజమా తెలియదులే .. కొంచెం కలయై కొంచెం నిజమై ఊయలూపె ఎదనే
నా హృదయం ఎరుగదు ఇదివరకు .. ఈ ప్రియ సరిగమలే
నా మనసుకు తెలియదు ఇదివరకు .. ఈ కసి గుసగుసలే
ఎక్కడో నువ్వున్నా .. పక్కనే ఉన్నట్టుందీ
ఎప్పుడూ నిన్నొదిలీ మనసిలా .. రానంటుందీ
ఎందుకో ప్రతిమాటా .. నీ పేరులా వినబడుతుందీ
అందుకే సగవాటా .. నీ పేరులో మనసడిగిందీ
దాహమే రేపినా .. మోహమే నీవులే
తీయనీ వీణలా .. గుండెల్లో మోగావులే
నా హృదయం .. హృదయం హృదయం హృదయం హృదయం హృదయం హృదయం హృదయం
నా హృదయం ఎరుగదు ఇదివరకు .. ఈ ప్రియ సరిగమలే
నా మనసుకు తెలియదు ఇదివరకు .. ఈ కసి గుసగుసలే
యవ్వనం నీకోసం నేర్చెలే .. వయ్యారాలూ వయ్యారాలూ
ఈ క్షణం నా ప్రాయం పేర్చెలే .. పూబాణాలూ
కంటిలో కాటుకలా కరిగినా .. నా స్వప్నాలే
గంటకో కోరికలా చేరనీ .. నీ కౌగిళ్ళే
బొత్తిగా మరచినా .. పడకలో నిద్దురా
ముద్దుకే మనసిలా .. పడుతుందిలే తొందరా
నా హృదయం .. నా హృదయం
నా హృదయం ఎరుగదు ఇదివరకు .. ఈ ప్రియ సరిగమలే
నా మనసుకు తెలియదు ఇదివరకు .. ఈ కసి గుసగుసలే
____________________
చిత్రం : యముడు (2010)
రచన : శశాంక్ వెన్నెలకంటి
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : సుచిత్రా కార్తీక్ కుమార్, సాగర్
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.