మిస్టీరియస్ స్టోరీ: స్కాట్లాండ్‌లోని పశ్చిమ తీరంలో… మనుషులు జీవించడానికి వీలు లేని కొన్ని దీవులు ఉన్నాయి. వాటిని ఫ్లాన్నన్ ఐజిల్స్ (Flannan Isles) అంటారు. చిత్రమేంటంటే… ఈ దీవులపై ఆధారపడి గొర్రెలకాపర్లు జీవించేవారు. తరచూ వారు తమ గొర్రెలను పడవల్లో దీవుల దగ్గరకు తీసుకెళ్లేవారు. ఎందుకంటే ఆ దీవుల్లో గడ్డి బాగా పెరిగేది. అది గొర్రెలకు బాగా నచ్చేది. దానికి తోడు వారికి ఓ విచిత్రమైన నమ్మకం ఉంది. ఆ గడ్డి తినే గొర్రెలు… అనారోగ్యాల నుంచి ఇట్టే మెరుగవుతాయనీ… పైగా కవల గొర్రె పిల్లలకు జన్మనిస్తాయని నమ్మేవారు. ఒక్కోసారి గొర్రెల కాపర్లు రాత్రిళ్లు కూడా ఆ దీవుల్లోనే ఉండిపోయేవారు. అలా ఉండిపోయేవారికి అప్పుడప్పుడూ అర్థరాత్రి మెలకువ వచ్చేది. లేచి చూస్తే… ఏదో సమస్య. ఎవరో వారిని వెంటాడుతున్నట్లు అనిపించేది. దాంతో దెయ్యాలే తమను ఇబ్బంది పెడుతున్నాయని వారు భావించారు. ఇలా ఒకే దీవులు.. అటు మంచిగా, ఇటు చెడుగా వారికి అనిపించాయి.
1896లో ఈ దీవుల్లో బోర్డ్ ఆఫ్ ట్రేడ్… నిధులు ఇచ్చి ఓ లైట్‌హౌస్ నిర్మించింది. 1899 డిసెంబర్‌లో లైట్ హౌస్ నిర్మాణం పూర్తైంది. మొదటిసారి అది వెలిగింది. మరి దాన్ని చూసుకోవాలి కదా. అందుకోసం నలుగురిని నియమించారు (Lighthouse Keepers). వీరు రొటేషన్ పద్ధతిలో పనిచేసేవారు. వారానికి 2 రోజులు సెలవు ఉండేది. అందువల్ల దీవుల్లో లైట్ హౌస్ దగ్గర ఎప్పుడూ ముగ్గురు వ్యక్తులు కంటిన్యూగా ఉండేవారు. వీరు రొటేషన్ పద్ధతిలో పనిచేసేవారు. వారానికి 2 రోజులు సెలవు ఉండేది. అందువల్ల దీవుల్లో లైట్ హౌస్ దగ్గర ఎప్పుడూ ముగ్గురు వ్యక్తులు కంటిన్యూగా ఉండేవారు. ఆ తరువాత
వాళ్లు చనిపోయారా, లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా… అన్నది తెలియలేదు. వారి మృతదేహాలు కనిపించలేదు. ఇక ఈ ఘటన ప్రపంచ చరిత్రలో ఓ మిస్టరీ (Unsolved Mystery)గా మిగిలిపోయింది.
మరిన్ని అంతుచిక్కని మిస్టీరియస్ స్టోరీల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.