ఏనుగు పేడ నుంచి తయారు చేసే కాఫీ అనగానే ఆశ్చర్యపోతున్నారా. అవును అండి థాయిలాండ్ లో ఏనుగు మలం నుంచి కాఫీ నీ తయారు చేస్తారు. దీనినే బ్లాక్ ఐవరీ కాఫీ అని పిలుస్తారు. ఇది ఒక్క కప్ కాఫీ సుమారు $50(4181/-) ఖరీదు ఉంటుంది. ఇక ఇది 1 kg 2,56,000 రూపాయలు ఉంటుంది.
అసలు ఈ కాఫీ ఎందుకు ఇంత ఖరీదు, ఎలా చేస్తారు అన్న ప్రశ్నలు మన బుర్రలోకి వచ్చేసే ఉంటాయి. మరి ఇప్పుడు ఈ గురించి తెలుసేసుకుందాం రండి.
ఇది ఎలా తయారు చేస్తారు?
ఈ కాఫీ నీ బ్లాక్ ఐవరీ కాఫీ కంపెనీ లిమిటెడ్ అనే సంస్థ తయారు చేస్తుంది. ఈ కాఫీ గింజలను తయారు చేసే విధానం నాణ్యమైన థాయ్ అరబిక్ చెర్రీస్ ను సేకరించడం నుంచి ప్రారంభమవుతుంది.
నాణ్యమైన థాయ్ అరబిక్ చెర్రీస్ ను సేకరించి వాటిని ఏనుగులకు పెట్టె ఆహరం తో పాటు కలిపేసి పెడతారు. ఏనుగులు అవి తీసుకున్న ఆహారాన్ని బట్టి జీర్ణమవడానికి 12 నుంచి 72 గంటల సమయం పడుతుంది. ఇలా ఆహరం అంత జీర్ణమయిపోయాక ఆ ఏనుగు విసర్జించిన మలం లో నుండి ఆ అరబిక్ చెర్రీస్ ను వేరు చేస్తారు.
ఇప్పుడు ఈ మలం నుండి సేకరించిన చెర్రీస్ ను ఆయా ప్రాంతీయ స్కూళ్లల్లో హై స్కూల్ చదివే విద్యార్థులతో వాటిని సుబ్రాంగా కడిగి, ఎండ బెట్టిస్తారు.
ఇలా ఆ చెర్రీస్ ను ఎండబెట్టిన తరువాత నాణ్యమైన పెద్ద సైజు లో ఉండే చెర్రీ గింజలను మాత్రమే ఎంపిక చేస్తారు. ఇప్పుడు ఈ నాణ్యమైన పెద్ద గింజలను రోస్ట్ చేస్తారు. ఇక రోస్ట్ చేసిన గింజలను ప్యాక్ చేసి పెద్ద పెద్ద హోటల్స్ కు అమ్మేస్తారు.
ఎందుకు ఇది ఇంత ఖరీదు:
ఈ బ్లాక్ ఐవరీ కఫ ని తయారు చేయడానికి 33 kgల కాఫీ చెర్రీలు వాడితే అందులో నుంచి 1kg బ్లాక్ ఐవరీ కాఫీ వస్తుంది. ఇంకా ఈ కాఫీ గింజలను తయారు చేసే పద్దతి లో మనుషుల కూలి పని చాలా అవసరం మరియు ఆ ఏనుగుల సంరక్షణ కూడా చూసుకోవాల్సి వస్తుంది వీటన్నింటికి మించి దాని రుచి. ఇందువల్లనే ఈ కాఫీ ఇంత ఖరీదు మరియు ప్రత్యేకం.
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ స్టోరీస్ ను సందర్శించండి.