ఈ రోజుల్లో మన చేతిలోని మొబైల్ ఫోన్ ఒక సాధారణ గ్యాడ్జెట్ కంటే ఎక్కువైంది. అయితే అదే ఫోన్ మన మీద శాపంగా మారిందని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. మీరు గమనించారా – మనం రోజులో ఎంతసేపు స్క్రీన్ చూస్తున్నామో ఎప్పుడైనా గమనించుకున్నారా?
🔍 మొబైల్ అడిక్షన్ అంటే ఏమిటి?
మొబైల్ అడిక్షన్ అనేది ఒక విధమైన డిజిటల్ వ్యసనం. వాస్తవానికి, ఇది “నోమోఫోబియా” అనే పేరుతో కూడా పిలవబడుతుంది – అంటే ఫోన్ లేకపోతే కలిగే భయం. ప్రస్తుత సమాజంలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ దీని బారిన పడుతున్నారు. ఒక మనిషికి తోడు మరొక మనిషి కంటే కూడా ఒక మొబైల్ ఉంటేనే దైర్యం వస్తుదన్నమాట.
🧠 మానసిక ఆరోగ్యంపై ప్రభావాలు
ఆత్మవిశ్వాసం లోపించడం
సోషల్ మీడియాలో ఇతరుల జీవితాలతో పోల్చుకుంటూ, మన సంతృప్తిని మనం కోల్పోతున్నాం.
ఆనందాన్ని తగ్గించడం
మొబైల్ వినోదం ఇవ్వగలిగినా, అది మన శరీరం సహజంగా ఉత్పత్తిచేసే డోపమిన్ లెవల్స్‌ను ప్రభావితం చేస్తోంది. దీని వల్ల మనమేదో కామెడీ లేదా ఎంటర్టైన్మెంట్ పొందుతున్నాం అనుకుంటున్నాం కానీ దాని వెనుక జరిగే కీడే అధికం.
నిద్రలేమి సమస్యలు
రాత్రిళ్ళు స్క్రీన్ ముందు గడపడం వల్ల మనం నిద్రపోతున్నామా లేదా మేల్కొని వున్నామా అనే విధంగా నిద్రపోతుంటాం, దీని వల్ల శరీరానికి మానసిక అలసట వస్తోంది.
ఒంటరితనంతో బాధపడటం
దీనికి అలవాటు పడటం వల్ల వాస్తవిక సంబంధాలు తెగిపోతాయి. మనం వెబ్‌లో ఉన్నా, మనసు మాత్రం ఒంటరితనంలో మునిగి ఉంటుంది ఉంది.
💡 దీని నుంచి బయటపడాలంటే?
- Digital Detox చేయండి – రోజులో కొన్ని గంటలు ఫోన్‌ని పూర్తిగా దూరంగా పెట్టండి.
- నిద్రకు ముందు మొబైల్ వాడకండి
- రియల్ టైం వారితో టైమ్ గడపండి – ఫిజికల్ ఇంటరాక్షన్ మానసిక ఆనందానికి ఔషధం.
- సోషల్ మీడియా ఉపయోగానికి పరిమితి పెట్టండి
- కొత్త హాబీలు ఎంచుకోండి – పుస్తకాలు చదవడం, సంగీతం వినడం లాంటి మీకు నచ్చిన ఆనందదాయక పనులు చేయండి.
మొబైల్ ఫోన్ మన జీవితంలో ఒక సాధనం మాత్రమే. దాని అధీనంలో జీవించడం కాదు, దాన్ని ఉపయోగించడం నేర్చుకోవాలి. మన మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, మన చేతుల్లోనే ఉంది.
ఈరోజు నుంచి చిన్న మార్పులు మొదలుపెడదాం. మన మెదడుకి ‘స్క్రీన్ బ్రేక్’ ఇవ్వడం మొదలు పెడదాం!
👉ఇలాంటి మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ సందర్శించండి