Home » ఇరుకన్నులు కన్నులు (Iru Kanulu Kanulu) Song Lyrics | Shashtipoorthi

ఇరుకన్నులు కన్నులు (Iru Kanulu Kanulu) Song Lyrics | Shashtipoorthi

by Lakshmi Guradasi
1.3K views
Iru Kanulu Kanulu Song Lyrics Shashtipoorthi

ఇరుకన్నులు కన్నులు కలిసి మురిసే మొదటి చూపులో
తొలి పిలుపు తగిలి మెరుపు మెరిసే మనసు నింగిలో
ఇక కునుకునే మది మరిచెలే
ఓక నది వలే అది ఉరికేలే
అలలెగసీ పడిన అలజడిలో

కన్నులు కన్నులు కలిసి మురిసే మొదటి చూపులో
తొలి పిలుపు తగిలి మెరుపు మెరిసే మనసు నింగిలో

తాకుతుంది ఏదో ఆపలేని మైకం
చూపుతుంది ఎదురై చిత్రమైన లోకం
చిలిపి ఊహలే తలుపు తీయగా
కలల నవగా కదిలిననిలా
ప్రాయమే పరాకుగా నన్నూపుతుంటే ఉయ్యాలే

ఇరుకన్నులు కన్నులు కలిసి మురిసే మొదటి చూపులో
తొలి పిలుపు తగిలి మెరుపు మెరిసే మనసు నింగిలో

రాసిపెట్టి ఉందే నీకు నాకు ముందే
కొరుకోని వరమే చెంత చేరుకుందే
మరువలేని.. ఈ మధుర హాయిని
యుగ యుగాలకు దాచి ఉంచని
ప్రాణమే ఓ గానమై నీ ధ్యాసలోనే ఉందని

ఇరుకన్నులు కన్నులు కలిసి మురిసే మొదటి చూపులో
తొలి పిలుపు తగిలి మెరుపు మెరిసే మనసు నింగిలో
ఇక కునుకునే మది మరిచెలే
ఓక నది వలే అది ఉరికేలే
అలలెగసీ పడిన అలజడిలో

కన్నులు కన్నులు కలిసి మురిసే మొదటి చూపులో
తొలి పిలుపు తగిలి మెరుపు మెరిసే మనసు నింగిలో

Song Credits:

సినిమా పేరు: షష్టిపూర్తి (Shashtipoorthi)
పాట పేరు : ఇరు కనులు కనులు (Iru Kanulu Kanulu)
గాయకులు: S. P. చరణ్ (S. P. Charan); విభావరి ఆప్టే జోషి (Vibhavari Apte Joshi)
కొరియోగ్రాఫర్: ఈశ్వర్ పెంటి (Eshwar Penti)
సాహిత్యం: రెహమాన్ (Rehman)
సంగీతం: ఇళయరాజా (Ilaiyaraaja)
ప్రధాన తారాగణం: ‘డా. రాజేంద్ర ప్రసాద్ (‘Dr. Rajendra Prasad,), ‘నేషనల్ అవార్డ్ విన్నర్’ అర్చన (National Award Winner’ Archana), రూపేష్ (Rupeysh), ఆకాంక్ష సింగ్ (Aakanksha Singh).

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.