Home » మీసమున్న నేస్తమా (Meesamunna Nesthama) సాంగ్ లిరిక్స్,స్నేహం కోసం

మీసమున్న నేస్తమా (Meesamunna Nesthama) సాంగ్ లిరిక్స్,స్నేహం కోసం

by Lakshmi Guradasi
3.7K views
Meesamunna Nesthama song lyrics

మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువ
మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువ
రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువ
కోపమెక్కువ కానీ మనసు మక్కువ

స్నేహానికి చెలికాడా దోస్తీకి సరిజోడ
ఎల్లేదిగిన పసివాడా ఎన్నటికీ నిను వీడ
మీసమున్న నేస్తమా హోయ్

ఏటిగట్టు చెబుతుంది అడుగు మన చేప వేట కధలు
మర్రి చెట్టు చెబుతుంది పంచుకొని తిన్న సద్ది రుచులు
చెరుకు తోట చెబుతుంది అడుగు ఆనాటి చిలిపి పనులు
టెంట్ హాల్ చెబుతుంది ఎన్టీఆర్ స్టంట్ బొమ్మ కధలు

పరుగెడుతూ పడిపోతూ ఆ నూతుల్లో ఈత కొడుతూ
ఎన్నెల్లో గడిచాయి ఆ గురుతులనే విడిచాయి
వయసెంత మరచి కేరింతలడే ఆ తీపి జ్ఞాపకాలు
కలకాలం మనతోటె వెన్నంటే ఉంటాయి
మనలాగే అవి కూడా విడిపోలేనంటాయి

మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువ
రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువ

ఒక్క తల్లి సంతానమైన మనలాగా వుండగలరా
ఒకరు కాదు మనం ఇద్దరంటే ఎవరైనా నమ్మగలరా
నువ్వు పెంచిన పిల్ల పాపాలకు కన్నా తండ్రినైనా
ప్రేమ పంచిన తీరులోన నే నిన్ను మించగలన

ఏ పుణ్యం చేసానో నే నీ స్నేహం పొందాను
నా ప్రాణం నీదైన నీ చెలిమి ఋణం తీరేనా
నీకు సేవ చేసేందుకైనా మరు జన్మ కోరుకొన
స్నేహానికి చెలికాడా దోస్తీకి సరిజోడ
ఎల్లేదిగిన పసివాడా ఎన్నటికీ నిను వీడ

మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువ
రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువ
కోపమెక్కువ కానీ మనసు మక్కువ

స్నేహానికి చెలికాడా దోస్తీకి సరిజోడ
ఎల్లేదిగిన పసివాడా ఎన్నటికీ నిను వీడ

__________

పాట: మీసమున్న నేస్తమా (Meesamunna Nesthama)
చిత్రం: స్నేహం కోసం (Sneham Kosam)
గాయకులు: రాజేష్ (Rajesh)
గీతరచయిత: సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Seetharama Sastry)
సంగీత దర్శకుడు: S. A. రాజ్‌కుమార్ (S. A. Rajkumar)
నటీనటులు: చిరంజీవి (Chiranjeevi), మీనా (Meena), విజయకుమార్ (Vijayakumar)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.