తననే తొలిచే మనుషులకే
దాహం చేర్చు నేల గుణం
తననే విరిచె చేతులకే
నీడై కాచే చెట్టు గణం
తననే తుంచే గాలులకే
గంధం పూసే పూలవనం
తననే తొలిచే ఉలి దెబ్బలకే
శిల్పం ఇచ్చే రాయితనం
మన్నింపు లేదంటే ఈ లోకాన ఏది లేదు లే
మన్నించే హృదయానికి ఏ బాధ రాదు లే
మన్నింపు లేదంటే ఈ లోకాన ఏది లేదు లే
మన్నించే హృదయానికి ఏ బాధ రాదు లే
కారడవిని కాల్చే చిచ్చువు కావా
పగతో ఉంటె నిత్యం
ఆ వీడిని దాటి వెలుగువు కావా
మన్నిస్తే కొంచం
పడి తడబడుతూనే పొరబడుతూనే
నేరే మనుషుల నైజం
ప్రతి తప్పును పగతో దండిస్తే
ఇక మిగిలేది శూన్యం
ఏ నేరం ఎరుగని ఆకులను
కన్నీరుగా రాల్చే కాలం
మల్లి తొలి చిగురులు ఇచ్చి
మాన్పేస్తుంది తను చేసిన గాయం
మన్నింపు లేదంటే ఈ లోకాన ఏది లేదు లే
మన్నించే హృదయానికి ఏ బాధ రాదు లే
మన్నింపు లేదంటే ఈ లోకాన ఏది లేదు లే
మన్నించే హృదయానికి ఏ బాధ రాదు లే
ఒక ఏనుగు కరిషం వీడిని చూసి
వెళ్ళిన దూరం చెబుతా
పులి వేసిన జాడల లోతును కొలిచి
బరువెంతో చెబుతా
ఒక్క నక్క వేసే ఊలను వింటూ
ఆకలి ఎంతో చెబుతా
తూనీగలు ఎగిరే వేగం తో
వర్షం వైనం చెబుతా
ఒక చిన్న అలికిడితోనె అడవంతా కనిపెడతానే
బిడ్డ నీ మనసును మాత్రం
అంతే చిక్కక వేతికేస్తున్నానే
మన్నింపు లేదంటే ఈ లోకాన ఏది లేదు లే
మన్నించే హృదయానికి ఏ బాధ రాదు లే
మన్నింపు లేదంటే ఈ లోకాన ఏది లేదు లే
మన్నించే హృదయానికి ఏ బాధ రాదు లే
________________________________________
పాట: మన్నింపు (Mannimpu)
చిత్రం: కంగువ (Kanguva) (Telugu)
గాయకులు: రఘు దీక్షిత్ (Raghu Dixit)
సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి (Kalyan Chakravarthy)
నటీనటులు: సూర్య (Surya), దిశా పటాని (Disha Patani), బాబీ డియోల్ (Bobby Deol) & ఇతరులు
దర్శకత్వం: శివ (Siva)
సంగీతం: ‘రాక్‌స్టార్’ దేవి శ్రీ ప్రసాద్ (‘Rockstar’ Devi Sri Prasad)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.