మనసులో మనసుకే
ఒక మానని గొడవ ఇది
తెలిసినా తెలిసినా
ఒక తెలియని బదులు ఇది
మనసులో మనసుకే
ఒక మానని గొడవ ఇది
తెలిసినా తెలిసినా
ఒక తెలియని బదులు ఇది
ముందెళ్ళనా ముళ్ళబాటన
పూల తోటలాగ తోవ చూపనా
నీడగా నడిచి తోడవనా
ఏ దిక్కు తోచక జీవించనా
మనసులో మనసుకే
ఒక మానని గొడవ ఇది
తెలిసినా తెలిసినా
ఒక తెలియని బదులు ఇది
బుల్లిగువ్వ జంట కలిసి
ఆ నింగినే అందేనా
అందేనా … అందేనా …
కొమ్మ రెమ్మ కోరి తెచ్చి
గూడె కట్టి కూడేనా
కూడేనా… కూడేనా…
నాలో నేనే బతికేదా
మనిషికి ఎందుకు ఈ బాధ
ఒకరికి ఒకరం కారాదా
విడిపోవుటయే ఈ గాధ
కలిసేదెలా కన్నయ్యతో
బృందావనంలో రాధ
మనసులో మనసుకే
ఒక మానని గొడవ ఇది
తెలిసినా తెలిసినా
ఒక తెలియని బదులు ఇది
ముందెళ్ళనా ముళ్ళబాటన
పూల తోటలాగ తోవ చూపనా
తోడొకరుంటే చాలననా
ఏ దిక్కు తోచక జీవించనా
మనసులో మనసుకే
ఒక మానని గొడవ ఇది
____________________________________
చిత్రం – విదుదల పార్ట్ 2 (Vidudala Part 2)
సాంగ్ – మనసులో (Manasulo)
సంగీత దర్శకుడు: ఇళయరాజా (Ilaiyaraaja)
గాయకులు – SPB చరణ్ & అనన్య భట్ (SPB Charan & Ananya Bhat)
లిరిక్స్ – కాసర్ల శ్యామ్ (Kasarla Shyam)
తారాగణం: విజయ్ సేతుపతి (Vijay Sethupathi) మంజు వారియర్ (Manju Warrier) సూరి (Soori)
దర్శకుడు: వెట్రి మారన్ (Vetri Maaran)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.