Home » మలుపు (Malupu) song lyrics || Shanmukh || Deepthi Sunaina

మలుపు (Malupu) song lyrics || Shanmukh || Deepthi Sunaina

by Lakshmi Guradasi
0 comments
Malupu Song lyrics private

సమయమే ఇక దొరకదు
నిమిషమే విషమా
మనసుకే ఇది తెలియని
ఊపిరిలో కలవరమా

గతమునే మది తొలిచెనే జ్ఞాపకాలేన్నో
చెరగవే మన గురుతులే
ఎప్పటికీ మన కథగా

విడిచిపోలేనంటే ఎదలో నీవే ఉంటే
ఈ దూరం కూడా దూరం చేసే ప్రేమే నీదే
విడిచిపోలేనంటే ఎదలో నీవే ఉంటే
ఈ దూరం కూడా దూరం చేసే ప్రేమే నీదే

కల ఇదా….
నిజమిదా….
కధ ఇదా…
మలుపిదా…

నీ అడుగులలో అడుగే పడినపుడే
ఈ జన్మే నీతో చాలనుకున్నాగా
నీ పెదవులపై మిగిలే చిరునవ్వై
ఈ జన్మే నీకే రాసిస్తున్నాగా

నిమిషాలన్నీ నిమిషం ఆపేనా
గడియారంతో సమరం చేస్తున్నా
లేనే లేదే వేరే మాటే ప్రాణం నీవే

కల ఇదా….
నిజమిదా….

సమయమే ఇక దొరకదు
నిమిషమే విషమా
మనసుకే ఇది తెలియని
ఊపిరిలో కలవరమా

గతమునే మది తొలిచెనే జ్ఞాపకాలేన్నో
చెరగవే మన గురుతులే
ఎప్పటికీ మన కథగా

విడిచిపోలేనంటే ఎదలో నీవే ఉంటే
ఈ దూరం కూడా దూరం చేసే ప్రేమే నీదే
విడిచిపోలేనంటే ఎదలో నీవే ఉంటే
ఈ దూరం కూడా దూరం చేసే ప్రేమే నీదే

కల ఇదా ఇదా…
నిజమిదా…
కధ ఇదా…
మలుపిదా….

Song Credits:

నటీనటులు : షణ్ముఖ్ జస్వంత్ (Shanmukh Jaswanth), దీప్తి సునైనా (Deepthi Sunaina)
కథ, దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్ & డిఐ: వినయ్ షణ్ముఖ్ (Vinay Shanmukh)
నిర్మాత: వందన బండారు (Vandana Bandaru)
సంగీతం & గాయకుడు: మనీష్ కుమార్ (Manish Kumar)
సాహిత్యం: కిట్టు విస్సాప్రగడ (Kittu Vissapragada)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.