Home » లేటెస్ట్‌ టెక్నాలజీ సామ్‌సంగ్‌ గెలాక్సీ స్మార్ట్‌ రింగ్‌

లేటెస్ట్‌ టెక్నాలజీ సామ్‌సంగ్‌ గెలాక్సీ స్మార్ట్‌ రింగ్‌

by Shalini D
0 comment

నేటి సాంకేతిక యుగంలో ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. అందుకు అనుగుణంగానే లేటెస్ట్‌ టెక్నాలజీతో కూడిన గ్యాడ్జెట్లు మార్కెట్‌లోకి వస్తున్నాయి. ఇటీవల కాలంలో ఈ ట్రెండ్ మరింత ఎక్కువైంది. స్మార్ట్‌ఫోన్ వాడకం పెరగడంతో.. స్మార్ట్‌ యాక్ససరీస్‌‌కు డిమాండ్ పెరుగుతోంది. స్మార్ట్ వాచ్‌లు, ఫిట్‌నెట్‌ ట్రాకర్లు వినియోగం విపరీతంగా పెరుగుతోంది. ప్రస్తుతం స్మార్ట్ రింగులు కూడా ఆ జాబితాలో చేరాయి. ఈ క్రమంలో.. తాజాగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ శాంసంగ్ కూడా రింగ్ లాంచ్ చేసింది. సామ్‌సంగ్ తన అన్‌ప్యాక్డ్ 2024 ఈవెంట్‌లో ఈ స్మార్ట్ రింగ్‌ను పరిచయం చేసింది.

ఈ ఈవెంట్‌లో రింగ్‌లు మాత్రమే కాకుండా.. వాచ్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, బడ్స్‌తో సహా ఇతర డివైజ్‌లను కూడా కంపెనీ విడుదల చేసింది. అయితే సామ్‌సంగ్ తీసుకొచ్చిన కొత్త రింగ్ వివరాల్లోకెళ్తే.. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకునే లక్ష్యంతో ఈ స్మార్ట్ రింగ్‌ను డెవలప్ చేశారు. ఇది మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడంతో పాటు మిమ్మల్ని ఫిట్‌గా ఉంచుకోవడంలో ఈ రింగ్ సహాయపడుతుంది. అన్‌ప్యాక్డ్ 2024 ఈవెంట్ సందర్భంగా ఈ స్మార్ట్ రింగ్ పరిచయమైంది.

సామ్‌సంగ్ రింగ్ స్పెసిఫికేషన్లు చూస్తే.. ఇది మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రత్యేకంగా రూపొందించారు. ఈ రింగ్‌ని సామ‌సంగ్ హెల్త్ యాప్‌కి కనెక్ట్ చేయడం ద్వారా మీరు మీ ఆరోగ్యాన్ని మానిటర్ చేయవచ్చు. మీరు మీ హార్ట్ బీట్ మీ నిద్ర అలవాట్లను చెక్ చేయాలన్నా లేదా మీ BP మొదలైనవాటిని తనిఖీ చేయాలనుకుంటే, మీరు ఈ రింగ్‌తో చేయవచ్చు. టైటానియంతో చేసిన ఈ రింగ్ వాటర్‌లో కూడా చెక్కుచెదరకుండా ఉంటుంది.

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ టెక్నాలజీ  ను సందర్శించండి.

You may also like

Leave a Comment