“కుంకుమలా” పాట రణబీర్ కపూర్ (శివ) మరియు అలియా భట్ (ఈషా) మధ్య సాగే ప్రేమ గీతం. ఇది వారి ప్రేమను మధురంగా, సంతోషంగా, మరియు ఆహ్లాదకరంగా ప్రదర్శిస్తుంది. పాటలో శివ తన ప్రేమను వ్యక్తం చేస్తూ, ఈషా తన జీవితంలో ఎంత ముఖ్యమో తెలియజేస్తాడు.
ఈ పాట ఒక మధురమైన ప్రేమ గీతం మాత్రమే కాకుండా, సంగీత ప్రియులను ఉర్రూతలూగించిన సాంగ్‌గా నిలిచింది. సిద్ శ్రీరామ్ మాయాజాలమైన గానం, ప్రీతమ్ మ్యూజిక్, మరియు రణబీర్-అలియా కెమిస్ట్రీ ఈ పాటను మర్చిపోలేని రొమాంటిక్ మెలోడీగా మార్చాయి.
kumkumala Nuvve song lyrics:
పెదాల్లో ఒక చిన్ని ప్రశ్నే ఉంది
నీకై క్షణాల్లో పడిపోని మనసే ఏది
ఆ బ్రహ్మే నిను చెయ్యడానికే
తన ఆస్తి మొత్తాన్నే ఖర్చే పెట్టుంటాడే
అందాల నీ కంటి కాటుకతో
రాసే ఉంటాడే నా నుదిటి రాతలనే
కుంకుమలా నువ్వే చేరగా ప్రియా
కోటి వర్ణాలయ్యా నేను ఇలాగ
వేకువలా నువ్వే చూడగా ప్రియా
వెండి వర్షానయ్యా వేడుకలాగా
మౌనంగా మనసే మీటే
మధురాల వీణవు నువ్వే
ప్రతి ఋతువుల పూలే పూసే
అరుదైన కొమ్మవు నువ్వే….
బ్రతుకంతా చీకటి చిందే
అమావాసై నేనే ఉంటే
కలిశావే కలిగించావే దీపావళి కలనే
జాబిల్లే నీ వెనకే నడిచేనే
నీ వెన్నెలనడిగేనే నీ వన్నెలనడిగేనే
అందాల నీ కంటి కాటుకతో పైవాడే
రాసే నా నుదిటి రాతలనే
కుంకుమలా నువ్వే చేరగా ప్రియా
కోటి వర్ణాలయ్యా నేను ఇలాగ
వేకువలా నువ్వే చూడగా ప్రియా
వెండి వర్షానయ్యా వేడుకలాగా
పమగమగ సరిగ
పమగమగ సరిగ సరిగ
దని మాగ
దని పమగ మ
____________
Song Credits:
పాట: కుంకుమల
చిత్రం: బ్రహ్మాస్త్ర: పార్ట్ 1
గాయకులూ: సైడ్ శ్రీరామ్
సాహిత్యం: చంద్ర బోస్
సంగీతం: ప్రీతమ్
దర్శకుడు: అయాన్ ముఖేర్జీ
నటి నటులు: రన్బీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్, తదితరులు.
Allari Motha Song Lyrics Brahmasthra
Deva Deva Song Lyrics Brahmasthra
మరిన్ని తెలుగు పాటల కొరకు తెలుగు రీడర్స్ లిరిక్స్ ని సందర్శించండి.