Konda Kona Chorasu Paade Lyrics Garividi Lakshmi

కొండ కోన కోరసు పాడే సాంగ్ లిరిక్స్, Garividi Lakshmi

by Lakshmi Guradasi

Song Credits:

పాట:కొండ కోన కోరసు పాడే Konda Kona Chorasu Paade
చిత్రం : గరివిడి లక్ష్మి Garividi Lakshmi
ఫీచర్స్: గరివిడి లక్ష్మి Garividi Lakshmi, ఆనంది Anandhi
గాయకులు: అనన్య భట్ Ananya bhat, చరణ్ అర్జున్ Charan Arjun
సంగీతం & సాహిత్యం: చరణ్ అర్జున్ Charan Arjun
దర్శకుడు: గౌరీ నాయుడు జమ్ము Gowri Naidu Jammu

Konda Kona Chorasu Paade Lyrics in Telugu

కొండ కోన కోరసు పాడే
ఊరువాడ గుంపులు గూడే
సత్తెనమ్మ కాడా విన్న
కొత్త పాట పాడనా…

నిప్పు నీరు డప్పై మోగే
గాలి ధూళి తాళం వేసే
పెద్ద పెద్ద గమకాలుండని
మట్టిపాటే పాడనా…

దేవుడమ్మకు వినబడకుండా
చెట్టులెక్కి పుట్టలనెక్కి
దేశమంతా పరవశమయ్యే
పాట పాడనా… పల్లె పాట పాడనా…

కొమ్మల్లో కూసే కోయిల
నాలాగా మారి గుమ్మంలో కూసుందే ఇలా…
గుడిలోనా మోగే గంటలే
స్వరజతులై నాలో ఉప్పొంగే పాటె వరదలా…

ఆటేగా పాటేగా అన్నీ తనతో పాటేగా
కదిలిస్తే కమ్మని రాగాలు
పలకడమూ తనకలవాటేగా…

గలగల పారే నదినాదములా
మిలమిల వెన్నెల వెలుగేదములా
వెదురు కొమ్మలే వేణువులవగా
రెప్పల చప్పుడే తాళం వేయగా
పశుపక్షాదులు ప్రేక్షకులవగా
కనిపించని కవులక్షరమియగా
ఆవుల ఆలికిడి శబ్దమెలయగా
ఆమని పలుకుల అమృతమై
పొద్దున్నే లేచి పొద్దల్లె మెరిసి
అడుగేసినాది ఇటువైపు
చూడు చూడు…

పట్టు పావడ గట్టి
పచ్చని పొలమున పరిగెడుతుందమ్మా
ఈ పాటల చిలకమ్మా…

వాగున సాగే నీరు చేసే హోరు
శబ్దంలా మోగే గమకాల పాటమ్మా…

కొండ కోన కోరసు పాడే
ఊరువాడ గుంపులు గూడే
సత్తెనమ్మ కాడా విన్న
కొత్త పాట పాడనా…

అన్నం నీళ్లే అక్కరలేదు
అన్నీ నాకు పాటంట…
నా పాటతోనే ఆ సూర్యుడు కూడా
మేలుకొని కదిలేనంట…

గురువే లేడుగా సపాసాలు
ఎలా అబ్బెనో అమ్మడికి …
చెరువులో చేపలు పశుపక్షులు
పరవశించు ఆగానముకి…

ఏ మూలన పాటలు వినబడినా
పరిగెడుతది పాదం ఉన్న ఫలం…
ఎద నిండా వాటిని నింపుకుని
పురి విప్పుతుంది నా మధుర గళం…

ఏ వేడుక అయినా వేదిక అయినా
వెంటనే గొంతున పాటూరేనా
ప్రాణంతో ఉన్నానని తెలిపే
పరికరం ఒకటే నాకు పాట
గుంపును చూస్తే ఆగదు కాలు
ఇంపుగా పాటతో ఇల నర్తనలు
జడగంటే నాకో రిథమ్ అంటూ
ప్రకృతిలో ప్రతిధ్వని వింటూ
నాతోపాటే పెరిగింది పాట
ఎటు చేర్చుతుందో ఏమో నను ఈ బాటే…

గలగల నవ్వున కూడా గజలో విజిలో వినిపించును చూడు
ఈ పాటల ఊటమ్మా…

మిలమిల మినుగురు లాగా నలుగురిలోనూ మెరిసేనోయమ్మా
ఈ పాటల పూవమ్మా…

కొమ్మల్లో కూసే కోయిల
నాలాగా మారి గుమ్మంలో కూసుందే ఇలా…
గుడిలోనా మోగే గంటలే
స్వరజతులై నాలో ఉప్పొంగే పాటె వరదలా…

Read also: kosindi koyagura song lyrics

Nala jilakara mogga song lyrics garividi lakshmi

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like