కాలా కాలాల కాడా మా అంజన్న
ఏటి కాలాల కాడా మా అంజన్న
కరుణగల్ల దేవుడవయ్యో మా అంజన్న
కరుణించగ రావేమయ్యో మా అంజన్న
కరుణగల్ల దేవుడవు కరుణించగ రావయ్యా
కరుణగల్ల దేవుడవు కరుణించగ రావయ్యా
అంజనమ్మ పుత్రుడవయ్యో మా అంజన్న
అందరికీ ఆత్రుడవయ్యో మా అంజన్న
అబ్బా కొండగట్టు కొండల్లోన మా అంజన్న
కొలువైన దేవుడవయ్యో మా అంజన్న
కోరుకున్న భక్తుల కల్లా మా అంజన్న
కోరికలు తీర్చేవయ్యో మా అంజన్న
కోరుకున్న కోన్న భక్తులకు కోరికలు దీర్చెవు
కోరుకున్న భక్తులకు కోరికలు దీర్చెవు
గుండములో తానాలయ్యో మా అంజన్న
గండాలు బపేవయ్యో మా అంజన్న
మహావీరాది వీరుడవయ్యో మా అంజన్న
వీరాంజనేయుడవయ్యో మా అంజన్న
సింధూర రూపుడవయ్యో మా అంజన్న
శివతేజవంతుడవయ్యో మా అంజన్న
శివతేజవంతుడవు శ్రీరామబంటుడవు
శివతేజావంతుడవు శ్రీరామవంతుడవు
శతవాను తేజుడవయ్యోమా అంజన్న
శతకోటి దండాలయ్యోమా అంజన్నా
నీరోమ రోమమునందు మా అంజన్న
శ్రీరామ నామము కాదా మా అంజన్న
నమ్ముకున్న భక్తుల కల్లా మా అంజన్న
నమ్మకము ఇచ్చేవయ్యో మా అంజన్న
నమ్ముకున్న భక్తులకు నమ్మకము ఇచ్చెవు
నమ్ముకున్న భక్తుల లకు నమ్మకము ఇచ్చేవు
పూలు పండ్లు తెచ్చినవయ్యో మా అంజన్న
నీ పూజ చేత్తుమయ్యో మా అంజన్న..
నీ గుడి లేని ఊరే లేదో మా అంజన్న
నిను దలువని మనిషే లేడో మా అంజన్న
నిను దలిచిన భక్తుల కల్లా మా అంజన్న
తండ్రి లాగా తోడుంటావో మా అంజన్న
నిను దలిచిన భక్తులకు తండ్రి లాగా తోడుంటావు
నిన్ను దలిచిన భక్తులకు తండ్రి లాగా తోడుంటావు
ఆజాను బాహుడవయ్యో మా అంజన్న
అభయమిచ్చే దేవుడవయ్యో మా అంజన్న
ఆజాను బాహుడవయ్యో మా అంజన్న
అభయమిచ్చే దేవుడవయ్యో మా అంజన్న
See Also plz click on this: kailasavasa-esha-paramesha-song-lyrics
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.
