అనగనగ ఒక అడవిలోని పక్షులు అన్ని ఒకదానికి ఒకటి సహాయం చేసుకుంటూ కలసి సంతోషంగా జీవిస్తుండేవి. కాని వాటిలో ఒకటైన కాకి పేరు చెప్తే అన్ని పక్షులకు భయం కలిగేది, ఎందుకంటే అది తెలివిగా ఉండేది, కానీ ఎవరికీ సహాయం చేయకుండా మితిమీరిన కోపంతో ఉండేది. ఒక రోజు వర్షం సమయంలో కాకి చెట్టు మీద నుంచి జారి కింద పడింది. దురదృష్టవశాత్తూ, దాని రెండు కాళ్ళు విరిగి ఒళ్ళంతా గాయాలతో బాధపడుతుంది.
ఇప్పుడు అది సరిగ్గా ఎగరలేక, తినలేక, మిగతా పక్షులపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా పక్షులు మొదట దానిని చూడటానికి వచ్చాయి, కానీ ఆ తర్వాత దానిని పట్టించుకోకుండా వెళ్లిపోయాయి. ఒక చిన్న పిచుక మాత్రం ప్రతి రోజూ ఆ కాకికి తిండి తేవడం మొదలుపెట్టింది. కాకి తొలుత అహంకారంతో “నీ సహాయం నాకు అవసరం లేదు” అని చెప్పింది, కానీ పిచుక మాత్రం శాంతిగా దాని దగ్గరే ఉండిపోయింది.
కాలక్రమేణా, కాకికి పిచుకపై అభిమానం పెరిగింది. ఒక రోజు అది ప్రశ్నించింది: “నువ్వు నాకేం లాభం లేకుండా ఇన్ని రోజులు సహాయం ఎందుకు చేస్తున్నావు?” అని అడిగింది. అప్పుడు పిచ్చుక నవ్వుతూ ఇలా చెప్పింది: “మనిషి అయినా పక్షి అయినా, సహాయం చేయడమే నిజమైన మంచితనం. నీకు ఇదివరకు అహంకారం ఉండేది. ఇప్పుడు నీవు మారిపోయావు. అదే నీ విజయానికి మొదటి అడుగు.” అని చెప్పింది.
ఈ సంఘటన కాకిని పూర్తిగా మార్చేసింది. ఇంతక ముందులా కాకుండా మిగతా పక్షులకు అది ఉపదేశాలు ఇవ్వడం మొదలుపెట్టింది. అహంకారం ఎలా మన పతనానికి కారణమవుతుందో, ప్రేమ, సహనం మనల్ని ఎంత బలంగా తయారు చేస్తాయో చెబుతూ. చివరకు కాకి ఓ గొప్ప ఉపాధ్యాయుడిగా మారి, పిచుకకు కృతజ్ఞతగా జీవితాంతం సహాయపడింది.
👉 ఇటువంటి మరిన్ని వాటి కోసం చూడండి తెలుగురీడర్స్ నీతి కథలు