Home » జిల్లెలమ్మ జిట్టా ( Jillelamma Jitta ) సాంగ్ లిరిక్స్ – Folk song 

జిల్లెలమ్మ జిట్టా ( Jillelamma Jitta ) సాంగ్ లిరిక్స్ – Folk song 

by Lakshmi Guradasi
4.1K views
Jillelamma Jitta song lyrics folk

పిల్ల అంటూ పిలిచినాడే
గల్లా మీసం పిల్లగాడు
పిల్ల గిల్లా నవ్వుతాడే
అల్లరి చేసే పిల్లగాడు
పిల్ల నాతో వస్తావా
పేపెరమెంటు ఇప్పిస్తా

ఓ పిల్ల నాతో వస్తావా
పేపెరమెంటు ఇప్పిస్తా
అంటూ ఆగం చేస్తాడేమే
మేనత్తకు తొలిసూరి కొడుకు వాడు

జిల్లెలమ్మ జిట్టా
వాని తోని దోస్తీ ఎట్ట
ఓ జిల్లెలమ్మ జిట్టా
వాని తోని ఎగేదెట్టా

జిల్లెలమ్మ జిట్టా
వాని తోని దోస్తీ ఎట్ట
జిల్లెలమ్మ జిట్టా
వాని తోని ఎగేదెట్టా

వాడకట్టుకు సందెకడా
సైగలుచేత్తాడు ఏమున్నా
సెను కాడ చెయ్యిపెట్టి
వదలంటాడు ఏ గుల్ల
ఏందే ఏమే అంటాడే
వాడి పెళ్ళాన్ని నేనే అయ్యినట్టు

వాడు ఏందే ఏమే అంటాడే
వాడి పెళ్ళాన్ని నేనే అయ్యినట్టు
అయినా కోపం రాదెందే
వాడి మాయలో నేను పడట్టు

జిల్లెలమ్మ జిట్టా
వాని మనసు తేనె పుట్ట
ఓ జిల్లెలమ్మ జిట్టా
వాడు లేకపోతే ఎట్ట

జిల్లెలమ్మ జిట్టా
వాని మనసు తేనె పుట్ట
జిల్లెలమ్మ జిట్టా
వాడు లేకపోతే ఎట్ట

వాడు దెగరకొస్తే పాడుగాను
గుండెల్లో గుబులు ఏందిల్లా
దురంగుండి సుత్తాంటే
ఏందో ఉందొ ఆ సుఫుల్లా
పాణం కన్నా ఎక్కువయ్యి
గుడిసేసుకున్నాడు గుండెల్ల
ధ్యానం గానం వాడిదయ్యి
కూడేసుకుంటాను వాన్నిల్లా
వాడు పక్కనుంటే లోకమంతా
వాడేవుంటాడు వెన్నెల్లా

జిల్లెలమ్మ జిట్టా
వాడు జన్మ జన్మల జంట
ఓ జిల్లెలమ్మ జిట్టా
ఇది రాసిన రాతేనంటా

జిల్లెలమ్మ జిట్టా
వాడు జన్మ జన్మల జంట
జిల్లెలమ్మ జిట్టా
ఇది రాసిన రాతేనంటా

నా పక్కనవుంటే దూరమైన
ప్రేమను చూపే కోపమమైన
నాలో దాగిన ప్రేమానంత
మౌనంగానే దాచుకున్న
అర్ధంకాలే బావ నీకు
వెళ్ళిపోతివి అలిగి నువ్వు
నువ్వే పాణం బావ నాకు
నీతోనే చిన్న గిళ్లేందుకు
ఏడిపిస్తే పాపమురా
నన్ను ఏలుకో పిల్లగాడా

జిల్లెలమ్మ జిట్టా
ఓ పిల్ల నీతో జంట
ఓ జిల్లెలమ్మ జిట్టా
వస్తున్న ఏలుకుంటా

జిల్లెలమ్మ జిట్టా
ఓ పిల్ల నీతో జంట
జిల్లెలమ్మ జిట్టా
వస్తున్న ఏలుకుంటా

______________________________________________________________

సాహిత్యం : మానుకోటప్రసాద్ (Manukota Prasad)
సంగీతం: కళ్యాణ్ కీస్ (Kalyan Keys)
గాయకుడు: శ్రీనిధి (Srinidhi)
నటి: నాగదుర్గ (Naga Durga)

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.