Jatharakosthava janu song lyrics Folk

జాతరకోస్తావా జాను (Jatharakosthava janu) సాంగ్ లిరిక్స్ – Folk song

by Lakshmi Guradasi

జాతరకోస్తావా జాను జాకెట్టు ఇప్పిస్తా
జాతరకోస్తావా జాను

మబ్బులు ముసిరేను బావ నీతో నే రాలేను
మబ్బులు ముసిరేను బావ

అరె తోడుగా ఉంటానే జాను భయమే రానీను
తోడుగా ఉంటానే జాను భయమే రానీయ్యను

మబ్బులు ముసిరేను బావ నీతో నే రాలేను
మబ్బులు ముసిరేను బావ
జాతరకోస్తావా జాను జాకెట్టు ఇప్పిస్తా
జాతరకోస్తావా జాను

తోటకు వస్తావా జాను పూలెన్నో కోసిస్తా
తోటకు వస్తావా జాను
తోటకు రాలేను బావ తోడుగా అన్నలున్నారు
తోటకు రాలేను బావ

భయమెందుకే నా జాను వరసకు భవనైతాను
భయమెందుకే నా జాను నేను నీకైనా ఫ్యాను
తోటకు రాలేను బావ తోడుగా అన్నలున్నారు
తోటకు రాలేను బావ

సినిమాకు పోదామే జాను చాటుగా చూసొద్దామే
సినిమాకు పోదామే జాను
సినిమాకు రాలేను బావ మంది చూస్తే రంది నాకు
సినిమాకు రాలేను బావ

రంది పడకే నా జాను నీకు తోడుగా ఉంటాను
రంది పడకే నా జాను నేను నీకై ఉన్నాను
సినిమాకు రాలేను బావ మంది చూస్తే రంది నాకు
సినిమాకు రాలేను బావ

సిరిసిల్ల పోదామే జాను చీరలు కొనిపెడతాను
సిరిసిల్ల పోదామే జాను
చీరలు నాకొద్దు బావ సిరిసిల్ల నేను రాలేను
చీరలు నాకొద్దు బావ

నువ్వు నాతో వస్తే చాలే జాను పూల పల్లకిలో తిప్పుతాను
నువ్వు నాతో వస్తే చాలే జాను పూల పల్లకిలో తిప్పుతాను
చీరలు నాకొద్దు బావ సిరిసిల్ల నేను రాలేను
చీరలు నాకొద్దు బావ

మా ఇంటికి వస్తావా జాను మందిలో మనువాడుతాను
మా ఇంటికి వస్తావా జాను
మా వోళ్ళతో చెప్పుతావా బావ మందిలో మనువాడుతామ
మా వోళ్ళతో చెప్పుతావా బావ

భయమెందుకే నా జాను మీ వాళ్ళతో చెబుతాను
భయమెందుకే నా జాను వరసకు భవనైతాను
బావ బంగారు బావ నీతోనే ఉంటాను
బావ బంగారు బావ

______________

నిర్మాత: గోపాల్ కె
లిరిక్స్: నరేష్ నార్
గాయకుడు: శివ కె & బట్టు శైలజ
సంగీతం : శివ కె
దర్శకత్వం: ఎస్పీ సూర్య
నటీనటులు: శివ కె & శ్రీదీప్

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like