జగమంతా నీదే కదరా జంగమా
జనమందరు పూజించే శివలింగమా
అర్థమవని ఆదిబిక్షు అవతారమా
ఆచరించి తెలిపే జీవిత సారమా
నాగుపాము నీ మెడలోన హారమా
నరులనెపుడు గాచే చెడు సంహారమా
తలన గంగ ఉన్నా తీరని దాహమా
జోలెవట్టి తిరగడమూ నీకవసరమా
నిండు నలుపు రూపమా
నిజాలేంటో చూపుమా
జంతు చర్మ దేహమా
అంతులేని సందేహమా
అర్థమవని ఆదిబిక్షు అవతారమా
ఆచరించి తెలిపే జీవిత సారమా
జగమంతా నీదే కదరా జంగమా
జనమందరు పూజించే శివలింగమా
పార్వతి సగభాగమై
గణనాధుడి పునాది పుట్టుకవై
వెలిగే నీకెందుకో ఆ స్మశాన సంచారం
కుబేరునికే వరములూ
కుమ్మరించి అష్టసిద్ధ నిధులు
నువ్వేమొ భిక్షాటన అసలు ఏంటి ఈ మర్మం
యే విశ్వమంత నీ భక్తజనమే
వాళ్ళ యెదలన్నీ నివాసమే
అయినా నీకూ ఇల్లు లేదట ఎంతటి హాస్యమే
నీ మాట దాటి చిన్న చీమ కూడా కాటెయ్యదుగా ఓ పరమేశ
ఓ చిటికేసి తీర్చెయ్యరాదే మా అందరి హరిగోస
నిలకడంటూ లేనీ నిత్య ప్రయాణమా
నిన్ను కొలిచే భక్తుల నిండు ప్రాణమా
అర్థమవని ఆదిబిక్షు అవతారమా
ఆచరించి తెలిపే జీవిత సారమా
నటరాజ స్వరూపమా పంచభూతములన్నీ నీవశమా
చావూ పుట్టుకలనే మించినదీ నీ మహిమ
కైలాసం వీడవా కాస్తయినా చూడు జనము గొడవ
అనుమానం తీర్చవా నువ్వు మనిషా దేవుడివా
నీ ఇంటి మనిషి ఆ పార్వతమ్మకూ బంగారాలే నిలువెల్ల
నీకు మాత్రము సిత్రంగా ఒళ్లంత బూడిదేల
ఒక యేడు కాదు రెండేండ్లు కాదు
ప్రతి యేడూ ఇంతే మా ప్రేమ
నిను సుట్టమోలె ఎంతనుకున్నా ఏ గుట్టు విప్పవేల
ఒక్కపొద్దు జాగారాలకు దీటుగా
సక్కదిద్దు మా బతుకులనే తేటగా
కోటి పేర్లు నీకున్నా అలవాటుగా
శంకరయ్య అంటే పలుకు ప్రేమగా
జగమంతా నీదే కదరా జంగమా
జనమందరు పూజించే శివలింగమా
నాగుపాము నీ మెడలోన హారమా
నరులనెపుడు కాచే చెడు సంహారమా
అర్థమవని ఆదిబిక్షు అవతారమా
ఆచరించి తెలిపే జీవిత సారమా
తలన గంగ ఉన్నా తీరని దాహమా
జోలెవట్టి తిరగడమూ నీకవసరమా
____________________
Song Credits:
సాంగ్ : జగమంతా నీదే కదరా జంగమా (Jagamantha Neede Kadara Jangama)
దర్శకుడు – దాము రెడ్డి Damu Reddy
సంగీతం మరియు సాహిత్యం – చరణ్ అర్జున్ Charan Arjun
గాయని – మంగ్లి (Mangli)
See Also plz click on this: endikondaalu-eletoda-song-lyrics
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
