Home » మోదీని కలిసిన భారత క్రికెట్ జట్టు

మోదీని కలిసిన భారత క్రికెట్ జట్టు

by Shalini D
0 comment

టీ20 వరల్డ్ కప్ ట్రోఫీతో బార్బడోస్ నుంచి స్వదేశానికి వచ్చిన భారత జట్టు ప్రధాని నరేంద్ర మోదీని మరికాసేపట్లో కలవనుంది. దేశరాజధాని ఢిల్లీలో ఉదయం 11 గంటలకు మోదీతో విశ్వవిజేతల భేటీ ఉంటుందని నేషనల్ మీడియా తెలిపింది. ఉదయం 6 గంటలకు ఢిల్లీకి చేరుకున్న జట్టు హోటెల్‌లో సేదదీరుతోంది. అనంతరం సాయంత్రం 5 గంటలకు ముంబైలోని మెరైన్ డ్రైవ్ నుంచి వాంఖడే స్టేడియం వరకు విక్టరీ పరేడ్ జరగనుంది.

టీ20 వరల్డ్ కప్ సాధించిన భారత జట్టు ఆటగాళ్లు ప్రధాని మోదీని కలిశారు. ఈరోజు ఉదయం 6గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన క్రికెటర్లు ఐటీసీ మౌర్య హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేసి అక్కడి నుంచి ప్రధాని నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారిని ప్రధాని మోదీ అభినందించారు.

T20WCతో భారత జట్టు ఈరోజు సా.5-7గంటల మధ్య ఓపెన్ బస్సులో పరేడ్‌లో పాల్గొంటుంది. ముంబైలోని నారీమన్ పాయింట్ నుంచి వాంఖడే స్టేడియం వరకు ఈ యాత్ర ఉంటుంది. విక్టరీ పరేడ్‌లో పాల్గొనాలనుకునేవారు సా.4.30గంటల్లోపు ఆ ప్రాంతంలో ఉండాలి.

స్టేడియంలో జరిగే కార్యక్రమానికి హాజరవ్వాలనుకుంటే సా.6గంటల్లోపే స్టేడియంలోకి వెళ్లి సీట్లలో కూర్చోవాలి. ముంబైలో ఉన్న మీ స్నేహితులు ఎవరైనా పరేడ్‌కు వెళ్తుంటే దీన్ని షేర్ చేయండి.

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ వార్తలు ను సందర్శించండి.

You may also like

Leave a Comment