Home » తక్షణమే కాళ్ల నొప్పులు మాయం ఇలా చేస్తే

తక్షణమే కాళ్ల నొప్పులు మాయం ఇలా చేస్తే

by Shalini D
0 comment

రోజంతా అలసిన పాదాలకు కాసేపయినా సాంత్వన కావాల్సిందే. మృతకణాలు తొలగించడానికి, పాదాల నొప్పులు తగ్గించడానికి, మృదువైన చర్మానికి.. ఇలా రకరకాల అవసరాలకు ఫూట్ సోక్స్ తయారు చేసుకోవచ్చు. పాదాలను గోరువెచ్చని కాళ్లలో కాసేపు ఉంచితేనే ప్రశాంతంగా అనిపిస్తుంది. రక్త ప్రసరణ పెరుగుతుంది. వివిధ ప్రయోజనాల కోసం రకరకాలు ఫూట్ సోక్స్ ఎలా ప్రయత్నించాలో చూడండి. అంటే ఒక టబ్ లో నీల్లు పోసి అందులో పాదాలు పెట్టడం. ఆ నీటిలో ప్రయోజనాల్ని బట్టి పదార్థాలు మార్చి వేస్తాం. దీనివల్ల పార్లర్ లో మంచి మసాజ్ చేయించుకున్న అనుభూతి దొరుకుతుంది.

పాదాలను నీళ్లలో మునిగేలా ఉంచడం వల్ల కండరాల నొప్పులు, ఒత్తిడి తగ్గుతాయి, పాదాలు ఆరోగ్యంగా ఉంటాయి. సాయంత్రం పూట ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. నిద్ర కూడా హాయిగా పడుతుంది. వయసు పైబడిన వాళ్లలో ఈ బాత్ టబ్ సోకింగ్ కోసం వాడే ఎసెన్షియల నూనెల వాసన వల్ల బీపీ తగ్గుతుంది. అరోమా థెరపీ లాగా ఇది పనిచేస్తుంది.

పాదాల నొప్పులకు: సగం కప్పు ఎప్సం లవణం, పది చుక్కలు ఏదైనా ఎసెన్షియల్ నూనె (పెప్పర్ మింట్, ల్యావెండర్, రోజ్ మేరీ..), 6 చెంచాల కొబ్బరి లేదా ఆలివ్ నూనె తీసుకోవాలి. ఇప్పుడు ఒక టబ్ లో వేడి నీళ్లు పోసుకుని నూనెలు, లవణం కలిపేయాలి. అందులో కనీసం పావుగంట సేపు పాదాలు ఉంచాలి. తర్వాత మీకిష్టమైన మాయిశ్చరైజర్ రాసుకోండి. నొప్పుల నుంచి ఉపశమనం ఉంటుంది.

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ టిప్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment