ఇంట్లోని ఆరోగ్య చిట్కాలు:
మన పెద్దలు పూర్వకాలంలో మనకు ఎన్నో వంటింటి చిట్కాల చెప్పారు. చిన్న జ్వరం (లేదా) జలుబు లాంటివి వస్తే డాక్టర్ దగ్గరకు వెళ్లకుండానే నయం చేసే చిట్కాలు(Tips) చాలా ఉన్నాయి.
కేవలం జ్వరం(Fever) లాంటి వాటికే కాకుండా అందం(Beauty), బలం(Strength), మధుమేహం(Blood Sugar), చర్మం రంగు మారడానికి(Skin beauty tips), కొవ్వు(Fat) కరిగించుకోవడానికి ఇలా దాదాపు ప్రతీ ఆరోగ్య సమస్యకు చిట్కా ఉంది. ఇలాంటి వంటింటి చిట్కాల గురించి, పెద్దలు ఇచ్చిన సలహాలు. ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అల్పాహారం (Breakfast) ఎలా చేయలి? హెల్త్ టిప్స్
ఇడ్లీ, దోశలు, వడ కాకుండా జొన్నలు, మినుములతో చేసిన ఇడ్లీ లేదా దోశలను తినాలి.
ఉడకబెట్టిన శెనగలు లేదా మొలకెత్తిన గింజలు తినాలి.
నూనెతో చేసిన టిఫిన్స్ (బోండా,దోస,వడ ఇలాంటివి) ఎంత తక్కువ తింటే అంత మంచిది.
మధ్యాహ్న భోజనం (Lunch) హెల్త్ టిప్స్?
మామూలు బియ్యంతో చేసిన అన్నం కన్నా ముడి బియ్యం, రాగి సంగటి, కొర్ర అన్నం ఆరోగ్యానికి చాలా మంచిది.
అన్ని రకాల కూరగాయలు తినడం మంచిది. అయితే వాటిలో నూనె లేకుండా చూసుకోండి.
వారానికి 3 సార్లు లంచ్ లో ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి.
రాత్రి భోజనం (Dinner) హెల్త్ టిప్స్
రాత్రి భోజనం 7 నుంచి 8 గంటల మధ్యలో చేయాలి.
రాత్రి రెండు లేదా మూడు జొన్న రొట్టెలు తీసుకుంటే మంచిది. ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకుంటే జీర్ణ ప్రక్రియ సాఫీగా సాగదు.
కొన్ని వంటింటి చిట్కాలు
వేపాకులను మజ్జిగలో మెత్తగా రుబ్బి, దాన్ని గాయంపై రాస్తే వెంటనే నయం అవుతుంది.
శరీరంపై ఎక్కడైనా కాలితే, అక్కడ పాలమీగడ రాస్తే బాధ తగ్గటమే కాదు శరీరం రంగు కూడా మారుతుంది.
ఒక కప్పు నీళ్లలో గుప్పెడు వేపాకులు, మిరియాలు బాగా మరిగించి అందులో రవ్వంత తేకె వేస్తే జలుబు, దగ్గు తగ్గుతాయి.
కొవ్వు పదార్ధాలు తక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే.. గుండెకు చాలా మంచిది.
మధుమేహంతో బాధపడేవారు ఆహారంలో నిత్యం వెళ్లుల్లి (Garlic) ఉండేలా చూసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.
పాలలో కన్నా తెల్ల నువ్వులలో ఎక్కువ కాల్షియం ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడు నువ్వులు తీసుకోవడం మంచిది.
ఆహారం వేడిగా ఉన్నప్పుడు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.
వారానికి 3సార్లు నల్ల నువ్వుల ఉండలు, వేరుశనగ ఉండలు, సున్నుండలు ఖచ్చితంగా చేసి పిల్లలకు తినిపించాలి.
కాలాన్ని బట్టి అన్ని రకాల పండ్లను స్నాక్స్ గా తీసుకోవాలి.
ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ప్యాకేజ్డ్ ఫుడ్ తీసుకోవటం ఆవేయాలి.
పిల్లలు నూనెతో చేసిన పదార్ధాలు ఎక్కువగా తినిపించకూడదు.
ఆహార పదార్ధాల్లో చక్కెర వాడకాన్ని తగ్గించాలి.
మితాహారమే మంచిది.
పెద్దలు తీసుకోవాల్సి జాగ్రత్తలు ఆరోగ్య చిట్కాలు
ఉదయాన్నే 3 లేదా 4 బాదాం పప్పులను నానబెట్టి తినటం మంచిది.
నిద్ర లేవగానే అరగంట యోగా, ధ్యానం చేయడం మంచిది.
వాడకానికి సముద్రపు ఉప్పు చాలా మంచిది.
టీ, కాఫీ బదులుగా రాగి జావను తీసుకోవాలి.
మార్కెట్ నుంచి లేదా ఇతర ప్రదేశాల నుంచి తెచ్చిన కూరగాయలను గొరువెచ్చటి నీటిలో 15 నిమిషాలపాటు ఉంచాలి.
ముక్కు దిబ్బెడ వేసినప్పుడు ఒక చుక్క ఉల్లిరసానని నాసికా రంద్రాల్లో వేస్తే మంచిది.
ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ టిప్స్ ను సందర్శించండి.