ఒక వర్తకునికి ఒక గుర్రము ఒక గాడిద ఉన్నాయి ప్రతి రోజూ సరుకు మూటలను ఆ రెండింటి పైనా వేసి మార్కేట్టుకు తోలుకుని పోతుండేవాడు. ఒక రోజున ఎక్కువ సరుకులు లేనందున కొన్ని మూటలను గాడిద పైన మాత్రమే వేసి మార్కెట్ కు తోలుకుని వెళ్తున్నాడు. అలవాటు ప్రకారం గుర్రం కూడా వీళ్ళ ప్రక్కనే నమస్తోంది.ಆ రోజున ఎండ చాల ఎక్కువగా ఉంది. నరుకులు మాయలేక గాడిద ఆయాస పడిపోతోంది.
చివరకది మెల్లగా గుర్రం చెవిలో మిత్రమా కొంచెం సేపు యీ బరువును నీవు మోసుకొని వస్తే అయాసంతీరిన తర్వాత మళ్ళీ నేనే మోసుకొస్తాను. దయచేసి యీ సహాయం చేయి అంది.
దానికి గుర్రం కోపంగా ఎవరి బరువును వాళ్ళే మోయాలి నేనెందుకు మోస్తాను అంది. ಆ మాటలతో గాడిదకు చాలా భాద కల్గింది కాని అది గుర్రాన్ని ఏమీ అనలేదు కొంచెం సేపు నడచి వడదెబ్బకు తట్టుకోలేక గాడిద మూర్భబోయింది.
ఎట్లాగైనా తన సరుకున తోందరగా మార్కెట్ కు చేర్చాలి అనే తలంపుతో ఆ వర్తకుడు మూటలన్నీటీని తీసి గుర్రం నడ్డి పైన వేసి తీసుకొని వెళ్ళేడు. కొంచెం దూరం యోయడానికి బదులు పూర్తి దూరం ఆ సరుకు నంతటినీ మోయవల్సి వచ్చింది గుర్రానికి.
మరిన్ని ఇటువంటి వాటి కోసంతెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.