Home » Godari Gattu Meeda (గోదారి గట్టు మీద) Song Lyrics In Telugu And English | Sankranthiki Vasthunnam

Godari Gattu Meeda (గోదారి గట్టు మీద) Song Lyrics In Telugu And English | Sankranthiki Vasthunnam

by Lakshmi Guradasi
0 comments
Godari Gattu song lyrics Sankranthiki Vasthunam

వరుస హిట్లతో హాట్ట్రిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వం లో వచ్చిన సినిమా “సంక్రాంతికి వస్తున్నాం.” వెంకటేష్ హీరో గా, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలు గా చేసిన ఈ సినిమా జనవరి 14, 2025 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఫామిలీ ఆడియన్స్ నుంచి చాల పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకి ఒక పాట మాత్రం చాల ప్రత్యేకంగా పాపులారిటీ వచ్చింది అదే గోదారి గట్టు మీద రామ సిలకావే సాంగ్.

పాట ఉద్దెశం

చాల రోజుల తర్వాత తన స్వరం తో మన ముందుకు వచ్చారు రమణ గోగుల. తన హిస్టరీ లో తాను పడిన ప్రతి పాట యువత లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. అలాంటి సింగర్ మళ్ళి ఇప్పుడు గోదారి గట్టు మీద రామ సిలకావే అంటూ మన ముందుకు వచ్చేసారు. మొగుడు పెళ్ళాల మధ్య జరిగే చిలిపి సరసాన్ని భాస్కరభట్ల రవి కుమార్ గారు చక్కగా రాసారు. ఇక ఈ పాటకు రమణ గోగుల మరియు మధుప్రియ తమ గాత్రం ఇంకొంచెం అందాన్ని తెచ్చారు. మరి ఇంత చక్కటి పాటని మీ భాగస్వామి తో కలిసి పడేయండి. లిరిక్స్ ఇక్కడే ఉన్నాయి.

గోదారి గట్టు సాంగ్ లిరిక్స్ తెలుగులో

హే గోదారి గట్టు మీద
రామ సిలకవే
హో గోరింటా కెట్టుకున్న
సంద మామవే
గోదారి గట్టు మీద
రామ సిలకవే
గోరింటా కెట్టుకున్న
సంద మామవే

ఊరంతా సూడు ముసుగే తన్ని
నిద్దరపోయిందే
ఆరాటాలన్నీ తీరకపోతే
ఏం బాగుంటుందే
నాకంటు ఉన్నా ఒకే ఒక్క
ఆడ దిక్కువే
నీతోటీ కాకుండా
నా బాధలు ఎవరికి
చెప్పుకుంటానే

గోదారి గట్టు మీద
రామ..సిలకనే
హా గీ పెట్టి గింజుకున్నా
నీకు దొరకనే

హే .. విస్తరి ముందేసి
పస్తులు పెట్టావే
తీపి వస్తువు చుట్టూ తిరిగే
ఈగను చేసావే
ఛీ ఛీ ఛీ సిగ్గే లేని
మొగుడు గారొండోయ్
గుయ్ గుయ్ గుయ్ గుయ్ మంటూ
మీదికి రాకొండోయ్

ఒయ్ ఒయ్
గంపెడు పిల్లల్తో
ఇంటిని నింపావే
సాప దిండు సంసారాన్ని
మేడెక్కించావే
ఇరుగు పొరుగు ముందు
సరసాలొద్దండోయ్
గురకెట్టి పొడుకోరే
గూర్కాల్లాగా మీ వాళ్ళు
ఏం చేస్తాం ఎక్కేస్తాం
ఇట్టాగే డాబాలు
పెళ్ళైయి సాన్నాల్లే
అయినా కానీ మాస్టారు
తగ్గేదే లేదంటూ
నా కొంగేనకే పడుతుంటారు

హే గోదారి గట్టు మీద
రామ సిలకవే
గోరింటాకెట్టుకున్న
సంద మామవే

కొత్త కోకేమో
కన్నే కొట్టిందే
తెల్లారేలోగా తొందర పడమని
చెవిలో చెప్పిందే
ఈ మాత్రం హింటే ఇస్తే
సెంటే కొట్టేయనా
ఓ రెండు మూరల మల్లెలు
చేతికి చుట్టేయినా

ఈ అల్లరి గాలేమో
అల్లుకుపొమ్మందే
మాటల్తోటి కాలక్షేపం
మానెయ్ మంటుందే
అబ్బా కబడ్డీ కబడ్డీ
అంటూ కూతకు వచ్చెయ్నా

ఏవండోయ్ శ్రీవారు
మళ్లీ ఎప్పుడో అవకాశం
ఎంచక్కా బాగుంది
చుక్కల ఆకాశం
ఓసోసి యిల్లాలా
బాగుందే నీ సహకారం
ముద్దులతో చెరిపెద్దాం
నీకు నాకు మధ్యన దూరం

గోదారి గట్టు మీద
రామ సిలకనే
హా నీ జంట కట్టుకున్న
సంద..మామనే

Godari Gattu Meedha Song Lyrics in English

He..Godari Gattu Meeda
Rama..Silakave
Ho..Gorintakettukunna
Sanda..Mamave
Godari Gattu Meeda
Rama..Silakave
Gorintakettukunna
Sanda..Mamave

Oorantha Soodu Musuge Thanni
Nidrapoyindhe
Aaratalaanni Teerakapothe
Em Baaguntundhe
Naakantu Unna Oke Okka
Aada Dikkuve
Neetoti Kaakunda
Naa Baadhalu Evaruku
Cheppukuntaane

Godari Gattu Meeda
Rama..Silakane
Gipetti Ginjukunna
Neeku Dorakane

He.. Vistari Mandesi
Pastulu Pettave
Theepi Vasthuvu Chuttu Tirige
Eeganu Chesave
Chee Chee Chee Sigge Leni
Mogudu Garondoy
Guy Guy Guy Guy Mantoo
Meediki Rakondoy

Oy Oy
Gampedu Pillalto
Intini Nimpave
Saapa Dindu Samsaranni
Medikinchave
Irugu Porugu Mundu
Sarasaloddandoy
Guraketti Paadukore
Gurkallaga Mee Vaallu
Em Chestaam Ekkestam
Ittage Dabalu

Pellayi Sennalle
Ayina Kaanee Mastaru
Taggede Ledantoo
Naa Kongenake Padutuntaru

Godari Gattu Meeda
Rama..Silakave
Gorintakettukunna
Sanda..Mamave

Kotha Kokemo
Kanne Kottindi
Thellareloga Thondara Padamani
Chevilo Cheppindi

Ee Maathram Hinte Iste
Sente Kotteyina
O Rendu Moorala Mallelu
Chethiku Chutteyina

Ee Allari Galemo
Allukupommanthe
Maataloti Kaalakshepam
Maney Mantundhe
Abba Kabaddi Kabaddi
Antoo Koothaku Vaccheyna

Evandoy Srivaru
Malli Eppudo Avakasam
Enchakkaa Baagundi
Chukkala Aakasam
Ososi Illala
Baagunde Nee Sahakaram
Muddu Tho Cheripeddaam
Neeku Naaku Madhyana Dooram

Godari Gattu Meeda
Rama Silaka..Ne
Nee Janta Kattukunna
Sanda..Mamane

Song Details:

పాట పేరుగోదారి గట్టు (Godari Gattu)
చిత్రంసంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam)
సంగీతంభీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo)
సాహిత్యంభాస్కర భట్ల రవి కుమార్ (Bhaskara Bhatla Ravi Kumar)
గాయకులురమణ గోగుల (Ramana Gogula), మధుప్రియ(Madhupriya)
రచయిత, దర్శకుడుఅనిల్ రావిపూడి (Anil Ravipudi)
సమర్పణదిల్ రాజు (Dil Raju)
నిర్మాతశిరీష్ (Shirish)
తారాగణంవెంకటేష్ దగ్గుబాటి (Venkatesh Daggubati), మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary), ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh), ఉపేంద్ర లిమయే (Upendra Limaye), తదితరులు.

Sankranthiki Vasthunnam Songs Lyrics

Meenu Song Lyrics Sankranthiki Vasthunnam
Chinna Raju Song Lyrics Sankranthiki Vasthunnam
Lallayire Song Lyrics Sankranthiki Vasthunnam
Blockbuster Pongal Song Lyrics Sankranthiki Vasthunnam
Guruvarya Song Lyrics Sankranthiki Vsthunnam

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.