Home » గజ్జెల మొనాలి (Gajjela Monali) సాంగ్ లిరిక్స్ – Folk Song 

గజ్జెల మొనాలి (Gajjela Monali) సాంగ్ లిరిక్స్ – Folk Song 

by Lakshmi Guradasi
1.2K views
Gajjela Monali song lyrics Folk

గడ్డేనక గంటల పొలమే
ఓ గజ్జల మొనాలి
గంట కొయ్య వత్తావ పిల్లో
నా గజ్జల మొనాలి

గంట కొయ్య నేనే వస్తే
ఓ సిల్వరు సిన్నోడా
కూలేంత రేటెంతయ్యో
నా సిల్వరు సిన్నోడా

అందరికి ఆర్డేరిస్తే
నీకు నూరు రూపాయే
గజ్జెల మొనాలి
జల్దీ సద్ది కట్టుకో
గజ్జెల మొనాలి

అందరికి ఆర్డేరైతే
నాకు రూపాయి ఎందుకు
సిల్వరు సిన్నోడా
నీ మనసులుంది చెప్పారో
సిల్వరు సిన్నోడా

గడ్డేనక అరెరే గడ్డేనక
అరె గడ్డేనక గంటల పొలమే
ఓ గజ్జల మొనాలి
గంట కొయ్య వత్తావ పిల్లో
నా గజ్జల మొనాలి

బండి ఎక్కరాదే
ఓ గజ్జల మొనాలి
పొద్దు తలమీదెక్కే
నా గజ్జల మొనాలి

బండి మలపరాదే
ఓ సిల్వరు సిన్నోడా
చెయ్యి అందుకోరో
నా ముద్దుల సిన్నోడా

కట్ట కింద కంది పొలము
ఓ గజ్జల మొనాలి
జల్దీ జల్దీ కొయ్యే పిల్లో
నా గజ్జల మొనాలి

జల్దీ జల్దీ నేనే కొస్తే
ఓ సిల్వరు సిన్నోడా
కందిరీగ నన్నే కుట్టే
నా సిల్వరు సిన్నోడా

ఆ కందిరీగ పాడుగాను అట్లెట్టకుట్టేనే
గజ్జల మొనాలి
కంటనీరు పెట్టాకే
గజ్జల మొనాలి

ఆ మాయదారి కందిరీగ మంటెట్టి పోయారో
సిల్వరు సిన్నోడా
కోకెత్తి పొత్తునే
గడసరి బుల్లోడా

కట్ట కింద …
అగొ కట్ట కింద కంది పొలమే
ఓ గజ్జల మొనాలి
కంది కొయ్య రాయ్యే పిల్లో
నా గజ్జల మొనాలి

పూల బాయికాడ
ఓ గజ్జల మొనాలి
మల్లె తోట నాదే
నా గజ్జల మొనాలి

తోట నీదే అయితే
ఓ సిల్వరు సిన్నోడా
నాకు రాసిస్తావా
నా సిల్వరు సిన్నోడా

మాలేనక మల్లెల వనము
ఓ గజ్జల మొనాలి
మల్లెలు ఎరా వత్తావ పిల్లో
నా గజ్జల మొనాలి

మల్లెలు ఎరా వద్దమంటే
ఓ సిల్వరు సిన్నోడా
మంది చూత్తే రందే మనకు
ఓ సిల్వరు సిన్నోడా

ఆ మందితోటి మనకెందుకు
ముందు చూసి నడవవే
గజ్జెల మొనాలి
ముళ్ల బాట ఉన్నదే
గజ్జెల మొనాలి

ఆ ముళ్ల బాట తోటకి
నేను నడిచి రానురో
సిల్వరు సిన్నోడా
నన్నెత్తు కొవురో
అల్లరి బుల్లోడా

మాలేనక.. పిల్ల మాలేనక
అగొ అగొ మలేనక మల్లెల వనము
ఓ గజ్జల మొనాలి
మల్లెలు ఎరా రాయ్యే పిల్లో
నా గజ్జల మొనాలి

నీలి కళ్ళ
ఓ గజ్జెల మొనాలి
జర్ర సూడే పిల్ల
నా గజ్జెల మొనాలి

నాకు నచ్చవురో
ఓ సిల్వరు సిన్నోడా
నేను మెచ్చనురో
రామసక్కని పిల్లోడా

ముందు నిమ్మల్ల కింద
ఓ గజ్జెల మొనాలి
నిల్చున్న నీకోసమే
నా గజ్జెల మొనాలి

మనసుంటే నా మీదనే
ఓ సిల్వరు సిన్నోడా
మరువకు నన్నేనాటికి
నా ముద్దుల బుల్లోడా

నిన్ను తాళి కట్టి ఏలుకుంటా
రాయ్యే పిల్ల పోదామే
గజ్జెల మొనాలి
పాణమంతా నువ్వేనే
గజ్జెల మొనాలి

నే బాస చేసి చెబుతున్న
నిన్నిడిసి ఉండరో
సిల్వరు సిన్నోడా
నే సొంతమైతిరో
సిల్వరు సిన్నోడా

పాట: గజ్జెల మొనాలి (Gajjela Monali)
లిరిక్స్ & నిర్మాత: యాదగిరి బొడ్డుపల్లి (Yadagiri Boddupalli)
గాయకులు :-శిరీష (shirisha ) & అమర్ (Amar)
సంగీతం:-హనీ గణేష్ (honey Ganesh)
తారాగణం :-పూజా నాగేశ్వర్ (Pooja Nageshwar), ప్రేమ్ కుమార్ (PremKumar)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.