Home » కళ్ళకు కాటుక పెట్టుకుంటున్నారా?

కళ్ళకు కాటుక పెట్టుకుంటున్నారా?

by Vinod G
0 comment
69

అమ్మాయిల అందమైన ముఖానికి పెద్ద కళ్ళు మరింత అందాన్ని ఇస్తాయి. అలాగే ఆ కళ్ళకు కాటుక పెడితే ముఖ సౌందర్యం మరింత పెరుగుతుంది. అందుకే చాలామంది యువతులు, మహిళలు కళ్ళకు కాటుక, ఐలైనర్ వంటివి వాడుతుంటారు. అయితే ఈ కాటుకను రోజంతా కళ్ళకు ఉంచడం మంచిది కాదు అంటున్నారు బ్యూటీషియన్స్.

అలాగే ఉంచుకోవడం వల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కాటుక పెట్టుకుని ఆఫీస్కి లేదా బయటకు వెళ్లి వచ్చాక రిమూవ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. కాటుక తయారీలో వాడే పదార్థాలు క్వాలిటీ లేనివైతే అవి కళ్ళలో చేరి ఏరుపెక్కడం, అసౌకర్యంగా అనిపించడం, కళ్ల మంట వంటి సమస్యలు వస్తాయి. మరికొందరిలో అలర్జీకి కారణమై కళ్ళ చుట్టూ వాపు, దురద, దద్దుర్లు వస్తాయి.

కాటుకను రోజంతా ఉంచడం వల్ల కొన్నిసార్లు కళ్ళు పొడిబారుతుంటాయి. అందుకే రోజులో కాసేపే కాటుకను ఉంచుకొని బయట నుండి ఇంటికి వచ్చాక కళ్ళను శుభ్రం చేసుకోవాలి. కల్తీ కాటుకల వల్ల కళ్ళు మసకబారడం, దృష్టి తగ్గడం, వంటి ప్రమాదకర లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. ఇలాంటి లక్షణాలు ఉండే వెంటనే కాటుకను వాడడం మానివేయాలని కంటి వైద్యుడు సూచిస్తున్నారు, కాబట్టి జాగ్రత్తగా వహించండి.

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ టిప్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Exit mobile version