ఒక రాజు గారి ప్రధాన మంత్రి ఆకస్మికంగా చనిపోయాడు ఆయన కింద ఉపమంత్రులు ముగ్గురుండేవాడు వారిలో ఎవరిని ప్రధాన మంత్రిని చెయ్యటమా అన్నది. రాజుకు సమస్య అయిపోయింది. ఒకరికి ఆ పదవి ఇచ్చినా మిగతా ఇద్దరికీ అన్యాయం జరగవచ్చు. ముగ్గురిలోనూ ప్రధాని పదవికి అర్హుడెవరో రాజు తేల్చ లేకపోయాడు.
కొద్దీ రోజులు గడిచాక రాజు నపరివారంగా నదీ తీరానికి వెళ్ళాడు. ఆయన వెంట ఉప ప్రథానులు ముగ్గురా ఉన్నారు. అందురూ నది ఒడ్డున కూర్చుని నరదాగా కాలక్షేపం చేస్తుండగా రాజు నది ఎగువకు చూసి నీటిలో ఏదో కొట్టుకు వస్తున్నది. అది మిటై ఉంటుంది.
ముగ్గరిలో ఒకడు కళ్ళ మీద చేయి పెట్టి పరకాయించి చూసి ఏదో పండులా గుంది. అన్నాడు మరోకడు లేచి నిలబడి చూసి అవును మహారాజా మామిడి పండు అన్నాడు.
ఈ లోపల మూడో వాడు లేచి తన కోటూ తలపాగా తీసి ఒడ్డున పాడేసి నదిలోకి దూకి ఈదుకుంటూ వెళ్ళి ఈ లోపల సమిపానికి వచ్చిన మామిడి పండును. తీసుకుని మళ్ళి ఈదుకుంటూ వచ్చి పండును తెచ్చి రాజు గారికిచ్చాడు. కార్య కూరడైనా ಆ ఉపమంత్రిని రాజు ప్రథానిగా నియమించాడు.
మరిన్ని ఇటువంటి వాటి కోసంతెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.