ఒక రోజు చిన్న గొర్రెపిల్ల ఒకటి దాహం తీర్చు డానికి అడవిలో ఉన్న ఓ కాలువ దగ్గరకు వెళ్లింది. ఆ అడవిలోకి క్రూర మృగాలు కూడా దాహం తీర్చుకోవడానికి ఆ కాలువ దగ్గరకే వస్తుంటాయి గొర్రెపిల్ల భయపడుతూనే గబగబా నీళ్లు తాగడం మొదలు పెట్టింది. దానికంటే ముందే అక్కడను వచ్చిన ఓ నక్కు కొద్ది దూరంలో నీళ్లు తాగుతోంది. కంగారులో గోర్రెపిల్ల నక్కును గమనించలేదు. ఒంటరిగా ఉన్న గొర్రెపిల్లను చూడగానే నక్క గట్టిగా ఏయ్ ఆగు నేను తాగే నీళ్లున్నీ పాడవుతున్నాయి. అని అరిచింది.
అయ్యో నక్క మామా నీళ్లు నీ వైపు నుంచే ఇటు పక్కను పారుతున్నాయి. నువ్వు తాగే నీళ్లు నేనెలా పాడు చేస్తాను అని అమాయకంగా అంది గొర్రెపిల్ల ಆమాటాలు నిజమే కానీ అది ఒప్పుకోవడానికి నక్క సిద్ధంగా లేదు నాతో వాదించడానికి నీకు ఎంత ధైర్యం ఓవో ఏడాది కిందట నాతో గొడవ పెట్టుకున్న గొర్రెపిల్ల పిల్లవు నువ్వే కదా
లేదు నక్క మామా అప్పటికి నేనుసలు పట్టలేదు అని చెప్పింది. గొర్రెపిల్ల ఆ మాటలతో నక్కకి పట్టలేనంత కోపం వచ్చింది. అయితే నాతో గొడవ పడింది. మీ అమ్మ అన్నమాటా మరి అప్పుడు నువ్వు కడుపులోనే కదా ఉన్నావు. కాబట్టి మీ అమ్మ గొడవ పడితే నువ్వు పడినట్టే అందుకే నీకూ శిక్ష పడాలి. అంటూ ఒక్కసారిగా ఆ గొర్రెపిల్ల పైకి దూకింది. నక్క పారిపోయే అవకాశం లేక నక్క చేతిలోనే చనిపోయింది. గొర్రెపిల్ల
మరిన్ని ఇటువంటి వాటి కోసంతెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.