Home » వర్షాకాలంలో రోగనిరోధక శక్తి పెంచే సూప్ తాగితే ఆరోగ్యం మెరుగుపడుతుంది

వర్షాకాలంలో రోగనిరోధక శక్తి పెంచే సూప్ తాగితే ఆరోగ్యం మెరుగుపడుతుంది

by Shalini D
0 comments

వర్షాకాలంలో రోగనిరోధక శక్తి కాస్త బలహీన పడుతుంది. అందుకే దాన్ని పెంచే ఆహారం తినడం తప్పనిసరి. రోగ నిరోధక శక్తి పెంచే సూప్స్ తాగితే మరీ మంచిది. అలాంటివే సొరకాయ సూప్, పాలకూర సూప్. వాటి తయరీ ఎలాగో వివరంగా చూసేయండి.

సొరకాయ సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు: మీడియం సైజు సొరకాయ, ముక్కలుగా కట్ చేసుకోవాలి, 1 ఉల్లిపాయ సన్నటి ముక్కలు, 2 టమాటాలు ముక్కలు, అంగుళం అల్లం ముక్క, సగం చెంచా వెల్లుల్లి ముద్ద, పావు టీస్పూన్ పసుపు, చెంచా నిమ్మరసం, చెంచా ఆలివ్ నూనె, సగం చెంచా మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు.

సొరకాయ సూప్ తయారీ విధానం: ముందుగా ప్రెజర్ కుక్కర్‌లో నూనె వేసుకుని అందులో కూరగాయల ముక్కలన్నీ వేసుకోవాలి. కొద్దిగా పసుపు, కారం, ఉప్పు వేసి ఉడికించుకోవాలి. రెండు కప్పుల నీళ్లు పోసి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వాలి. కుక్కర్ మూత తీసి ఈ కూరగాయల్ని చల్లారబెట్టాలి.చల్లారాక ఈ కూరగాయ ముక్కల్ని మిక్సీ పట్టుకోవాలి.

మళ్లీ కూరగాయలు ఉడికించిన నీళ్లను పాత్రలో పోసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. అందులో మిక్సీ పట్టుకున్న కూరగాయల మిశ్రమం వేసుకోవాలి. ఒక రెండు నిమిషాల పాటూ బాగా ఉడకనివ్వాలి. అందులో నిమ్మరసం వేసి దింపేసుకుంటే సొరకాయ సూప్ రెడీ.

పాలక్ సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు: 1 కట్ట పాలకూర, 3 వెల్లుల్లి రెబ్బలు, అంగుళం అల్లం ముక్క, 2 చెంచాల నూనె, 2 చెంచాల ఉల్లిపాయ ముక్కలు, 1 చెంచా బటర్, సగం చెంచా మిరియాల పొడి, సగం చెంచా ఉప్పు, పావు టీస్పూన్ పంచదార, 1 బిర్యానీ ఆకు, 2 కప్పుల పాలు.

పాలక్ సూప్ తయారీ విధానం: ముందుగా ప్యాన్ వేడి చేసుకుని నూనె పోసుకోవాలి. లవంగాలు, వెల్లుల్లి, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవాలి. ఉల్లిపాయ రంగు మారాక పాలకూర కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. పాలకూర కొద్దిగా ఉడికిపోయాక స్టవ్ కట్టేసి చల్లార్చుకోవాలి.

ఈ మిశ్రమాన్నంతా మిక్సీలో వేసి మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకుని కాస్త నూనె వేసుకుని చెంచా నూనె లేదా బటర్ వేసుకోవాలి. బిర్యానీ ఆకు వేసుకుని ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమం వేసుకోవాలి. రెండు నిమిషాలు సన్నం మంట మీద ఉడకనివ్వాలి. అందులో కొద్దిగా నీళ్లు , పాలు, మిరియాల పొడి, ఉప్పు, పంచదార వేసుకుని కలియబెడితే పాలకూర సూప్ రెడీ.

ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగు రీడర్స్ టిప్స్ను సందర్శించండి.

You may also like

Leave a Comment