Home » కుక్క నక్క నీతి – కథ

కుక్క నక్క నీతి – కథ

by Rahila SK
0 comment

అడవిలో ఉండే నక్క ఒకటి ఒకనాడు దారితప్పి ఒక ఊళ్లోకి వచ్చేసింది. అది తోవ వెంబడి వెళుతుండగా ఒక కుక్క దానికి ఎదురువచ్చింది. నక్క ఆ కుక్క ను ఆశ్చర్యంగా చూస్తూ నీ మేడలో ఆ గులుసు, ఆ బిళ్ల ఏమిటి ? అని ప్రశ్నించింది నక్క. ఓహ్! అదా! నన్ను నా యజమాని పెంచుకుంటున్నాడు. విధికుక్కలతో పాటు నన్ను పట్టుకువెళ్లి కాల్చివేయకుండా ఉండటానికి ఈ బిళ్లను నా మెడలో కట్టాడు” అని కుక్క నక్కకు చెప్పింది. ఆశ్చర్యంగా ఉందే అంది నక్క. నీవు అడవిలో ఉంటావు కాబట్టి నీకు తెలియదులే. మా యజమాని చాలా మంచివాడు. నన్ను తన ఇంట్లో పెట్టుకుని పెంచుకుంటున్నాడు. నాకు మంచి మంచి రొట్టెలు, మాంసం, పాలు అన్ని పెడతాడు. రోజు వేడినీళ్లతో స్నానం చేయిస్తాడు. నాకు తినడానికి పళ్లెం, పాలు తాగడానికి గిన్నె ఉన్నాయి. అంతేకాదు, పదుకోవడానికి మెత్తటి పరుపు కూడా ఉంది. అంది కుక్క గర్వంగా. అలాగే అంది నక్క ఈర్ష్యగా. అంతేకాదు మా యజమాని దగ్గర బోలేడు పిల్లలు కూడా ఉన్నారు. జాతి వైరం మరచి మేమంతా సరదాగా ఆదుకుంటాం అని చెప్పింది కుక్క.

మిత్రమా ఈ రోజు నుంచి మనమిద్దరం స్నేహితులం. నన్ను మీ ఇంటికి తీసుకుని వాళ్లు అంది నక్క. సరేనని కుక్క నక్కను తన ఇంటికి తీసుకువెల్లింది. యజమాని చుస్తే కొడతాడని నక్కను పెరట్లో చెట్టుచాటున దాచి తన రొట్టెలు, మాంసం దానికి పెట్టసాగింది కుక్క. ఒక రోజు కుక్క నక్కతో నీవొచ్చి చాలా రోజులైంది. నా యజమాని చుస్తే నిన్ను చంపేస్తాడు వెళ్ళిపో అంది కుక్క. మిత్రమా నిన్ను వదలివేళ్లలని లేదు. మరుసటిరోజు అందరూ నిద్రపోతున్న సమయంలో నక్క పిల్లి పిల్లలను చంపి తిని, ఎముకలు పడేసి వెళ్లి పోయింది. నమ్మకంగా ఉంటూ కుక్క ఇంతపని చేసింద అనుకున్న యజమాని కుక్కను చితక్కొట్టి ఇంటినుంచి తరిమేశాడు.

నీతి: దుర్మార్గులతో స్నేహం ప్రమాదకరం.

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ నీతి కథలు ను సందర్శించండి.

You may also like

Leave a Comment