దారంతా మా పూలవనమే రాధమ్మ
రోజంతా నే కావాలి ఉంటా రాధమ్మ
నా తోడు నువ్వుండుపోవే రాధమ్మ
ఏడేడు జన్మల బంధమే నీదమ్మా
నీకోసమే పుట్టినాను కిట్టయ్యా
నీదానినై ఉండిపోతా కిట్టయ్యా
మారాజులా చూసుకుంటా కిట్టయ్యా
మనువాడి నీ నీడగుంటా కిట్టయ్యా
ఆహా ఊరంతా పందిరి వేస్తానే రాధమ్మ
డప్పుల సప్పుడు మోగిస్తా రాధమ్మ
మారాజులా చూసుకుంటా కిట్టయ్యా
మనువాడి నీ నీడగుంటా కిట్టయ్యా
ఆహా పెళ్లి సందడంతా సెయ్యాలే రాధమ్మ
అక్షింతలే నిన్ను తడపాలే రాధమ్మ
దారంతా మా పూలవనమే రాధమ్మ
రోజంతా నే కావాలి ఉంటా రాధమ్మ
నా తోడు నువ్వుండుపోవే రాధమ్మ
ఏడేడు జన్మల బంధమే నీదమ్మా
పట్టు చీరాల సుట్టుకుంటానమ్మా
తాళి బొట్టుల అల్లుకుంటానమ్మా
కాలి మెట్టెనై కలిసుంటా రాధమ్మ
కడదాకా కుంకుమ బోటైతా రాధమ్మ
బాసింగ బంధాన్ని నేనేలే కిట్టయ్యా
అక్షింతల ఆనందాన్నిస్తాను కిట్టయ్యా
నీ బుగ్గ దిష్టి సుక్కును నేనయ్యా
నీ పాదదాసిలా ఉంటాను కిట్టయ్యా
బతుకంతా నువ్వుంటే పండగే రాధమ్మ
సెలయేరులా ఎగిరి గంతేస్తా రాధమ్మ
నేలమ్మా ఒడి నేనే నా చిన్ని కిట్టయ్యా
నీ నవ్వులన్నీ నావే కిట్టయ్యా
మన ఊరు మనవాళ్ళ మధ్యలో రాధమ్మ
మనసారా మన జంట నడవాలే రాధమ్మ
దారంతా మా పూలవనమే రాధమ్మ
రోజంతా నే కావాలి ఉంటా రాధమ్మ
నా తోడు నువ్వుండుపోవే రాధమ్మ
ఏడేడు జన్మల బంధమే నీదమ్మా
నువ్వింటికొచ్చిన వేళ రాధమ్మ
వరిసేను బంగారమైనదే రాధమ్మ
ఒడ్లన్నీ వరమిచ్చినాయే రాధమ్మ
మన ఇల్లు కళకళలాడే సూడమ్మా
ఎడడుగుల బంధమేసి కిట్టయ్యా
ఏడేడు జన్మల బంధము కిట్టయ్యా
ఋణము తీర్చుకున్నవయ్యో కిట్టయ్యా
ఏ జన్మల పుణ్యమేదో కిట్టయ్యా
ఆహా దేవుళ్లే నిన్ను పంపించి రాధమ్మ
నన్ను పనమోలే చూడుమన్నారమ్మా
ఇద్దరి ప్రాణం ఒక్కటే కిట్టయ్యా
నా లోకమంతా నువ్వే కిట్టయ్యా
బతుకంతా ఈ మాట మరువనే రాధమ్మ
నూరేళ్ళు నీతోనే ఉంటానే రాధమ్మ
దారంతా మా పూలవనమే రాధమ్మ
రోజంతా నే కావాలి ఉంటా రాధమ్మ
నా తోడు నువ్వుండుపోవే రాధమ్మ
ఏడేడు జన్మల బంధమే నీదమ్మా
_______________
సాంగ్ : దారంతా మా పూలవనమే రాధమ్మ – Part 2
నిర్మాత: వివాన్ కుసుంబ (Vivaan kusumba)
సాహిత్యం: నాగరాజు కసాని (Nagaraju kasani)
గాయకులు: బొడ్డు దిలీప్ (Boddu dilip) – శ్రీనిధి (Srinidhi)
సంగీతం: వెంకట్ అజ్మీరా (Venkat ajmeera)
కాస్టింగ్: అనిల్ జీలా (Anil geela) – సహస్ర (Sahasra)
దర్శకత్వం: రాజ్ నరేంద్ర (Raj narendra)
దారంతా మా పూలవనమే రాధమ్మ Part 1 లిరిక్స్
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.