ఒక పేదవాడు అడవికి పోయి కట్టెలు కొట్టి వాటిని మోపు కట్టి వీపున వేసుకుని బస్తీలో అమ్ముకోవటానికి వచ్చాడు. బస్తీ విధిలో జనం జాస్తిగా ఉన్నారు. పేదవాడి వీపున ఉన్న కట్టెలు బారు జాస్తిగా ఉన్నాయి. అందుచేత వాడు గొంతెత్తి తోలగండి బాబూ తోలగండి అని కేకలు పెడుతూ వీధి వెంట నడిచాడు. వాడి కేక విని జనం తప్పుకుంటూ వచ్చారు. కాని ఒక దాంభికుడు పక్కుకు తోలగలేదు అతని బట్టలు కట్టేలకు పట్టుకుని చిరగాయి దాంభికుడికి మండిపోయింది. అతను ఆపేదవాణ్ణి న్యాయాధికారి వద్దకు లాక్కుపోయి వాడు తన బట్టలు చించాడని ఫిర్యాదు చేశాడు.
న్యాయాధికారి పేదవాణ్ణి ఎన్నో ప్రశ్నలు వేశాడు. కాని పేదవాడు తల పంచుకుని బెల్లం కొట్టిన రాయిలాగా ఉండిపోయాడు. చివరకు న్యాయాధికారి విసిగి ఈ మూగ వెధవను నా దగ్గరికి తెచ్చారేమిటి అని దాంభికుణ్ణి అడిగాడు. అయ్యా వీడిప్పుడు దొంగ వేషం వేస్తున్నాడు. విధిలో నడిచేటప్పుడు తొలగండి బాబూ తోంగండి అని వీడుగాపు అని వీడు గావుకేకలు పెట్టడం నేను చెప్పులారా విన్నాను దాంభికుడు అలాగా వాడి కేకలు విని కేకలు విని కూడా తొలగకపోవటం మీదె తప్పు మీ ఫిర్యాదు కొట్టేస్తున్నాను అన్నాడు న్యాయాధికారి.
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.