Home » డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిన కోనోకార్పస్(Conocarpus) చెట్లు ఆరోగ్యానికి హానికరమా..పూర్తి వివరణ

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిన కోనోకార్పస్(Conocarpus) చెట్లు ఆరోగ్యానికి హానికరమా..పూర్తి వివరణ

by Vinod G
0 comment

శంఖు రూపంలో( కోన్ ఆకారం)లో పచ్చగా, అందంగా, ఆకర్షణీయంగా కనిపించే ఈ ‘కోనోకార్పస్’ మొక్కలు లేదా చెట్లు రహదారుల వెంబడి డివైడర్లలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. నగరాల్లో పచ్చదనాన్ని పెంచేందుకు వివిధ దేశాలు గుబురుగా పెరిగే ఈ చెట్లను బాగా ఆదరించాయి.

కోనోకార్పస్(Conocarpus) గురించి పూర్తి వివరణ..

కోనోకార్పస్ అమెరికా ఖండాల్లోని తీర ప్రాంతానికి చెందిన మొక్క. ఇది ప్రధానంగా ఉత్తర అమెరికాలోని ఫ్లోరిడా సముద్ర తీర ప్రాంతంలో పెరిగే మాంగ్రూవ్ జాతి మొక్క. ఇది వేగంగా, ఎత్తుగా, పచ్చగా పెరిగే మొక్క.

దీన్ని అరబ్, మద్య ప్రాచ్య దేశాల్లో ఎడారి నుంచి వచ్చే దుమ్ము, ఇసుక తుఫాన్లకు, వేగంగా వీచే వేడి గాలులకు అడ్డుగోడగా పనిచేస్తుందని మొదట్లో ఈ మొక్కలను ఆ దేశాలలో విస్తృతంగా నాటారు.

concocarpus trees remove in ap deputy cm pavwan kalyan

ఇది ఏపుగా ఒక కోన్ షేప్‌లో పెరుగుతుంది కాబట్టి ఆ ప్రాంతాలను సందర్శించిన నర్సరీల నిర్వాహకులు, మన ప్లాంటేషన్ ఎక్స్‌పర్ట్ దీన్ని భారతదేశానికి తీసుకువచ్చారు. ఇక్కడ ముఖ్యంగా మున్సిపాలిటీలు ,అర్బన్ ఏరియాల్లో నాటారు. మన ప్రాంతానికి చెందిన మొక్కకాదు కాబట్టి ఇది పర్యావరణ సంబంధ దుష్ప్రభావాలను కలిగిస్తుందని, అంతే కాకుండా, శ్వాస సంబంద వ్యాధులు, అనేకరకాల ఎలర్జీలకు కోనోకార్పస్ కారణం అవుతుందని నిపుణులు తెలియచేసారు.

దీని కారణంగా చాల దేశాలలో దీని వాడకాన్ని నిషేదించారు. మన భారత దేశంలో కూడా చాల రాష్ట్రాలలో దీనిపై ఆంక్షలు విధించారు. రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లోను దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ మొక్క గురించి మాట్లాడడం జరిగింది. వీటిని డివైడర్లు నుండి తీసివేయాలని సూచించడం జరిగింది.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ స్టోరీస్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment