ఒక అడవిలో రావి చెట్టు పై చిలుక తన ఇద్దరి పిల్లలతో ఉండేది. ఒక రోజు పెద్ద గాలివాన రావడంతో చిలుక గూడు పడిపోయి తల్లి చిలుక చనిపోయింది. అటుగా వెళ్తున్న ఒక వేటగాడికి ఒక చిలుక పిల్లి దొరికింది. మరొక ఒకటి ముని ఆశ్రమంలో పడింది. ఆ చిలక పిల్లను ముని బాలకులు చేరదీశారు.అవి కొంత కాలానికిపెద్దయ్యాయి. ఒక రోజు ఆ ప్రాంతం రాజు అడవిలో వేటకు వెళ్తుండగా వేటగాడి వద్ద పెరిగిన చిలుక రాజును చూసి ఎవడో వస్తున్నాడు. తరిమేయండి వాడిని అంటూ అరిచింది. రాజకు ఆచిలుకపై అసహ్యం వేసి ముందుకు కదిలాడు కొంత దూరం వెళ్లేసరికి ముని ఆశ్రమం కనిపించింది. అక్కడున్న చిలక రాజును చూసి దయ చేయండి మహారాజా మీరు మా ఆశ్రమానికి రావడం చాలా సంతోషం అని ఆహ్వానించింది. అప్పుడు రాజు ఈ రెండు చిలుకలు చూడడానికి ఒకేలా ఉన్నాయి. కాని వీటి స్వభావంలో ఎంత తేడా ఉంది. అన్నాడు దానికి ఆచిలిక వాడు నాతమ్ముడే మహారాజు వేటగాడి వద్ద పెరగడం వల్ల అలా మారిపోయాడనికి చెప్పింది.
ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగు రీడర్స్ నీతి కథలును సందర్శించండి.