చిరుగాలి నీ తోడై ఉంది ముందడుగై
వనమంతా నీకోసం వేచింది పదవోయ్
మ్ మ్ మ్, కష్టాలు కడగండ్లు తీరే రోజులున్నై
చీకట్లు తరిమేటి రోజే రానుందోయ్, మ్ మ్ మ్
చిరుగాలి నీ తోడై ఉంది ముందడుగై
వనమంతా నీకోసం వేచింది పదవోయ్
కష్టాలు కడగండ్లు తీరే రోజులున్నై
చీకట్లు తరిమేటి రోజే రానుందోయ్
ప్రతి చెట్టులో పుట్టలో… నవ్వు పువ్వులే పూసెనే
ప్రతి చెట్టులో పుట్టలో… నవ్వు పువ్వులే పూసెనే
నీ అడుగే పడి నేల… మళ్ళి పాట పాడాలోయ్
ఆనందం నీ పేరు
కన్నుల్లో ఏ కన్నీరు
ఆనందం నీ పేరు
సాగాలోయ్ నీ పూతేరు, నీ తేరు
కోయిలమ్మ పాట లేకుండా… తోట విరిసిందా
వానజల్లు తోడు లేకుండా… నేల మురిసిందా
తూరుపింట మబ్బే… పొద్దు రాకుండా ఆపిందా
రాతిరిని దాటి… రవి కాంతులే రాలేదా
ప్రతి పొద్దు నీకు జయం
ముందరుంది నీ విజయం
ఓరిమి చూపు పదా
దొరికెను ప్రతిఫలం
చిరుగాలి నీ తోడై ఉంది ముందడుగై
వనమంతా నీకోసం వేచింది పదవోయ్
కష్టాలు కడగండ్లు తీరే రోజులున్నై
చీకట్లు తరిమేటి రోజే రానుందోయ్
ప్రతి చెట్టులో పుట్టలో… నవ్వు పువ్వులే పూసేనే
నీ అడుగే పడి నేల… మళ్ళి పాట పాడాలోయ్
ఆనందం నీ పేరు… కన్నుల్లో ఏ కన్నీరు
ఆనందం నీ పేరు… సాగాలోయ్ నీ పూతేరు
ఆనందం నీ పేరు… కన్నుల్లో ఏ కన్నీరు
ఆనందం నీ పేరు… సాగాలోయ్ నీ పూతేరు
_____________________________
పాట – చిరుగాలి (Chirugaali)
చిత్రం – జై భీమ్ (Jai Bhim)
సంగీతం – సీన్ రోల్డాన్ (Sean Roldan)
గాయకుడు – శ్రీకాంత్ హరిహరన్ (Sreekanth Hariharan)
లిరిక్స్ – నరసింహన్ వూరుపుటూరు (Narasimhan Vuruputoor)
రచన & దర్శకత్వం: Tha.Se. జ్ఞానవేల్ (Tha.Se. Gnanavel)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.