చెల్లి వినవే నా తల్లి వినవే
నీ అన్నను కాను, అమ్మే నేను
చిట్టి వినవే నా బుజ్జి కనవే
నీ పుట్టుమచ్చై ఉంటా తోడు
ఉసురే పోతు ఉన్నా
పంచేస్తాలే నా ప్రేమే
లోకం చిన్నదైపోయే
నీ చిరు ఒడిలో బంగారు
చెల్లి వినవే నా తల్లి వినవే
నీ అన్నను కాను, అమ్మే నేనూ
బతుకులే వీధిపాలైనా
నిను రధములో తిప్పుకోన
దైవమే విడిచి పొమ్మన్నా
నిను విడువనే చిట్టి కన్నా
ఊపిరాగిపోయినను ఆత్మనయ్యి నే రానా
సృష్టిలోని ప్రేమంత నీకు పంచనా
జన్మే మరల ఉంటె
నీకు అమ్మై పుట్టనా
ఆకలై నువ్వు ఏడుస్తే
నా మనసే తల్లి పాలై మరిగే
నా వేలు పట్టుకుని నీవస్తే
ఆ స్వర్గమై నేల వెలిసే
భూమి బద్దలైపోయి
రెండు ముక్కలే అయినా
ఉయ్యాలల్లే నే మారి
నిన్ను మోయనాజన్మే మరల ఉంటె
నీకు అమ్మై పుట్టనా
చెల్లి వినవే నా తల్లి వినవే
నీ అన్నను కాను, అమ్మే నేను
_____________
పాట : చెల్లి వినవే (Chelli Vinave (from “Bichagadu 2”))
చిత్రం : బిచ్చగాడు 2 (Bichagadu 2)
మ్యూజిక్: విజయ్ ఆంటోని (Vijay Antony)
బాలనటులు : మాదేష్ (Madesh) & శివన్య (Shivanya)
రాసినవారు : భాష్యశ్రీ (Bhashyasree)
గాయకుడూ: అనురాగ్ కులకర్ణి (Anurag Kulkarni)
దర్శకుడు: విజయ్ ఆంటోని (Vijay Antony)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.