Home » చీమ ఉపకారం – కథ

చీమ ఉపకారం – కథ

by Haseena SK
0 comment

ఒక అడవిలో ఒక నక్క తోడేలు జింక తమ జాతి వైరం మరచి ఎంతో స్నేహంగా వుండేవి. ఒకరికి కష్టం వస్తే మరొకరు ఆదుకోవడం దొరికిన ఆహారాన్ని అందురూ పంచుకుని తినడం చేస్తుండవి. చెట్టాపట్టాలు వేసుకొని అడవి అంతా కలియ తిరుగుతుండేవి. ఒకనాడు ఒక గుండు చీమ ఆ దారినపోతూ వీటి స్నేహం చూసి ముచ్చుట పడింద. 

మీ ముగ్గురి స్నేహం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా వుంది. జాతి వైరం మరచి మీరు సంచరిస్తున్నా తీరు నాకు ఎంతగానో నచ్చింది. నేను కూడా మీతో స్నేహం చేయలనుకుంటున్నాను. నన్ను మీ జట్టులో చేర్చుకోండి అని చీమ అడిగింది. అందుకు అవి నవ్వి ఓసి చీమా నువ్వు చూస్తే ఇంత చిన్న ప్రాణివి మేము నీ కంటే చాలా పెద్దవాళ్లం నీలాంటి అల్పజీవితో మాకు స్నేహం ఏమిటి అని ఎగతాళి చేశాయి.

చీమ చిన్నబుచ్చుకుని మిత్రులారా అలా అనకండి ఈ సృష్టిలో ప్రతి  ప్రాణివల్లా ఏదో ఒక ప్రయోజనం వుంటుంది. అన్నది కాని అవి చీమ తో స్నేహం చేయడానికి ఒప్పుకోలేదు. అయినా చీమ మాత్రం వదలకుండా అవి వున్న ప్రాంతంలోనే తిరుగాడు సాగింది.  ఒకనాడు ఒక వేటగాడు అడవిలో వేటకు వచ్చాడు. నక్క తోడేలు జింక అతని కంట పడ్డాయి. వేటగాడు వాటికి బాణం గురిపెట్టాడు. అది గమనించిన చీమ వేటగాడి కాలి మీదకి షాకి గట్టిగా కుట్ట సాగింది. 

వేటగాడు గట్టిగా అరిచి చేతిలో బాణంకింద పడేశాడు. ఇది చూసిన నక్క తోడేలు జింక చీమ చేసిన ఉపకారానికి ఎంతో సంతోషించి చీమను తమ జుట్టులో చేర్చుకొని నాటి చీమతో ఎంతో స్నేహంగా వుండ సాగాయి.

నీతి: చిన్న ప్రాణి అని అలుసు చేయరాదు చిన్న వాళ్లు కు సాయం చేయవచ్చు.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment