హ.. చలి చలిగా అల్లింది
గిలి గిలి గా గిల్లింది
నీ వైపే మల్లిందీ మనసూ
చిట పట చిందేస్తుంది
అటు ఇటు దూకేస్తుంది
సతమతమై పోతుంది వయసూ
చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు ఏవేవో
గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి పోతున్నాయి
చిట్టి చిట్టి చిట్టి చిట్టి ఊసులు ఇంకేవో
గుచ్చి గుచ్చి చంపేస్తున్నాయే
నువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవైనట్టు
నన్నే చూస్తున్నట్టు.. ఊహలూ
నువ్వు నా ఊపిరైనట్టు నా లోపలున్నట్టు
ఎదో చెబుతున్నట్టు ఏవో కలలు
చలి చలిగా అల్లింది
గిలి గిలి గా గిల్లింది
నీ వైపే మల్లిందీ మనసూ
చిట పట చిందేస్తుంది
అటు ఇటు దూకేస్తుంది
సతమతమై పోతుంది వయసూ
గొడవలతో మొదలై
తగువులతో బిగువై..
పెరిగిన పరిచయమే నీదీ నాది
తలపులు వేరైనా.. కలవని తీరైనా
బలపడి పోతుందే.. ఉండే కొద్దీ
లోయలోకీ.. పడిపోతున్నట్టు
ఆకాశం పైకే.. వెలుతున్నట్టు
తారలన్నీ.. తారస పడినట్టు
అనిపిస్తుందే నాకు.. ఏమైనట్టు
నువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవైనట్టు
నన్నే చూస్తున్నట్టు.. ఊహలూ
నువ్వు నా ఊపిరైనట్టు నా లోపలున్నట్టు
ఎదో చెబుతున్నట్టు ఏవో కలలు
నీపై కోపాన్నీ.. ఎందరి ముందైనా
బెదురే లేకుండా.. తెలిపే నేనూ
నీపై ఇష్టాన్నీ.. నేరుగ నీకైనా
తేలపాలనుకుంటే.. తడబడుతున్నానూ
నాకు నేనే.. దూరం అవుతున్నా
నీ అల్లరులన్నీ గురుతోస్తుంటే
నన్ను నేనే.. చేరాలనుకున్నా
నా చెంతకి నీ అడుగులు పడుతూ ఉంటే
నువ్వు నాతోనే ఉన్నాట్టు నా నీడవైనట్టు
నన్నే చూస్తున్నట్టు.. ఊహలూ
నువ్వు నా ఊపిరైనట్టు నా లోపలున్నట్టు
ఎదో చెబుతున్నట్టు ఏవో కలలు
చిత్రం: మిస్టర్ పర్ఫెక్ట్ ( Mr Perfect)
పాట పేరు: చలి చలిగా (Chali Chaliga)
తారాగణం: ప్రభాస్ (Prabhas), కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal), తాప్సీ పన్ను (Taapsee Pannu), ప్రకాష్ రాజ్ (Prakash Raj), నాజర్ (Nassar), సాయాజీ షిండే (Sayaji Shinde), కె. విశ్వనాథ్ (K. Viswanath), మురళీ మోహన్ (Murali Mohan), బ్రహ్మానందం (Brahmanandam) తదితరులు
గాయకులు: శ్రేయా ఘోషల్ (Shreya Ghoshal)
సాహిత్యం: అనంత్ శ్రీరామ్ (Ananth Sreeram)
సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)
చిత్ర దర్శకత్వం: దశరధ్ (Dasaradh)
బదులు తోచని సాంగ్ లిరిక్స్ – మిస్టర్ పర్ఫెక్ట్
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి