Home » నగుమోము తారలే – రాధే శ్యామ్

నగుమోము తారలే – రాధే శ్యామ్

by Hari Priya Alluru
0 comment
158

నగుమోము తారలే.. తెగిరాలె నేలకే

ఒకటయితె మీరిలా.. చూడాలనే

సగమాయె ప్రాయమే.. కదిలేను పాదమే

పడసాగె ప్రాణమే.. తన వెనకే

మోహలనే.. మీరేంతలా.. ఇలా..

మోమాటమే ఇక.. వీడేనులే

ఇప్పుడే ఏకమయ్యె.. ఈ రాధేశ్యాం

ఇప్పుడో లోకమయ్యె.. ఈ రాధేశ్యాం

కదలడమె మరిచెనుగా.. కాలాలు నిన్నే చూసి

అణకువగా నిలిచెనుగా.. వేగాలు తాళాలేసి

ఎచటకు ఏమో తెలియదుగా.. 

అడగనె లేని చెలిమిదిగా

పెదవులకేమో అదె పనిగా..

నిమిషము లేవే విడివిడిగా

సమయాలకే.. సెలవే ఇకా

దేవులేనిది.. ప్రేమకానిది

ఓ కథే.. ఇదే కదా

ఇప్పుడే ఏకమయ్యె.. ఈ రాధేశ్యాం

ఇప్పుడో లోకమయ్యె.. ఈ రాధేశ్యాం

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Exit mobile version