Home » బుజ్జి తల్లి (Bujji Thalli) సాంగ్ లిరిక్స్ – తండేల్ (Thandel) (Telugu)

బుజ్జి తల్లి (Bujji Thalli) సాంగ్ లిరిక్స్ – తండేల్ (Thandel) (Telugu)

by Lakshmi Guradasi
0 comments
Bujji Thalli song lyrics Thandel

నాగచైతన్య, సాయి పల్లవి లవ్ స్టోరీ తర్వాత మళ్ళి జంటగా వస్తున్న సినిమా తండేల్. ఒక నిజమైన కథను ఆధారంగా తీసుకొని ఈ సినిమాను తీశారు. ఈ సినిమాను ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నారు. ఈ సినిమా నుండి మొదటి పాట “బుజ్జి తల్లి” ని చిత్ర బృందం విడుదల చేసింది. విడుదల అయినప్పటి నుండి ఈ పాట ప్రేక్షకుల నుండి మంచి ఆధారణనే పొందిది.

బుజ్జి తల్లి పాట వివరాలు:

ఈ పాట లోని లిరిక్స్ చూస్తుంటే ఇద్దరు ప్రేమికుల మధ్య గొడవ జరిగాక తనతో మాట్లాడమని ప్రేయసిని వేడుకుంటున్న సందర్భం లో వచ్చేలా అనిపించింది. ఈ పాటకి శ్రీమణి గారు సాహిత్యాన్ని అందించగా దానికి తోడుగా మన DSP సంగీతం మంచి మెలోడీ ఫీల్ ను తీసుకువచ్చింది. మరి ఎందుకు ఆలస్యం ఈ మెలోడి పాటను పడేద్దాం రండి.

బుజ్జి తల్లి సాంగ్ లిరిక్స్ తెలుగు లో

పల్లవి:
గాలిలో ఊగిసలాడే దీపం లా
ఊగిసలాడే నీ ఊసందక నా ప్రాణం
నల్లని మబ్బును చుట్టిన చంద్రుడిలా
చీకటి కమ్మెను నీ కబురందక నా లోకం

సుడిగాలిలో పడి పడి లేచే పడవల్లే తడబడుతున్న
నీ కోసం వేచుందే నా ప్రాణం

ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైన మాటాడే
నా బుజ్జి తల్లి….

చరణం 1:
నీరులేని చేపల్లే తార లేని నింగల్లె
జీవమేది నాలోన నువ్వు మాటలాడందే

మళ్ళి యాలకొస్తానే కాళ్ళ ఏళ్ళ పడతానే
లెంపలేసుకుంటానే ఇంక నిన్ను యిడిపోనే

ఉప్పు నీటి ముప్పుని కూడా గొప్పగా దాటే గట్టోడ్నే
నీ కంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే

నీ కోసం వేచుందే నా ప్రాణం
ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాటాడే
నా బుజ్జితల్లి…

చరణం 2:
ఇన్ని నాళ్ళ మన దూరం తియ్యనైన ఓ విరహం
చేదు లాగ మారిందే అంది రాక నీ గానం

దేన్ని కానుకియ్యాలే ఎంత బుజ్జగించాలే
బెట్టు నువ్వు దించేలా లంచమేంటి కావాలే

గాలి వాన జాడే లేదా రవ్వంతైనా నా చుట్టూ
అయినా మునిగిపోతున్నానే దారే చూపెట్టూ

నీ కోసం వేచుందే నా ప్రాణం
ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాటాడే
నా బుజ్జితల్లి…

Bujji Thalli Song Lyrics in English

Pallavi
Gaalilo Oogisalaade Deepam La Oogisalaade
Nee Oosandhaka Naa PraaNam
Nallani Mabbulu Chuttina Chandrudilaa
Cheekati Kammenu Nee Kaburandhaka Naa Lokam

Sudigalilo padi padi leche
Padavalle thadabaduthunna

Nee Kosam Vechundhe Naa PraaNam
O Bujji Thalli
Naa Kosam O Maataina Maataade
Naa Bujji Thalli

Charanam 1
Neeruleni Chaepalle
Thaaraleni Ningalle
Jeevamedhi Naalona
Nuvvu Maataladandhe

Malli YaaLakosathaane
Kaalla Yella Padathaane
Lempalesukuntaane
Inka Ninnu Idipone

Uppuneeti Muppuni Kooda
Goppaga Daate Gattonne
Neekanti Neetiki Maathram
Kottukupothaane

Nee Kosam Vechundhe Naa PraaNam
O Bujji Thalli
Naa Kosam O Maataina Maataade
Naa Bujji Thalli

Charanam 2
Inni Naalla Mana Dooram
Theeyyanaina O Viraham
Chedhulaaga Maarindhe
Andhiraaka Nee Gaaram

Denikaanukeeyaale
Yentha Bujjaginchaale
Bettu Nuvvu Dinchelaa
Lancham Yenti Kaavale

Gaali Vaana Jaada Ledhe
Ravvanthaina Naachuttu Aynaa
Munigi Pothunnaane
Dhaare chupettu

Nee Kosam Vechundhe Naa PraaNam
O Bujji Thalli
Naa Kosam O Maataina Maataade
Naa Bujji Thalli

Song Credits:

పాట పేరు బుజ్జి తల్లి (Bujji Thalli)
చిత్రం తండేల్ (Thandel)
గాయకుడూ జావేద్ అలీ (Javed Ali)
లిరిక్స్ శ్రీమణి (Sreemani)
సంగీతం దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)
దర్శకుడు చందూ మొండేటి (Chandoo Mondeti)
సమర్పకులు అల్లు ఆరవింద్ (Allu Aravind)
నిర్మాత బన్నీ వాసు (Bunny Vasu)
కథ కార్తీక్ తీడా (Karthik Theeda)
తారాగణం నాగ చైతన్య (Naga Chaithanya), సాయి పల్లవి (Sai Pallavi), తదితరులు.

Thandel Movie Songs Lyrics

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.