Home » భంభం భోలే (Bham Bham Bole) సాంగ్ లిరిక్స్ – ఇంద్ర (Indra)

భంభం భోలే (Bham Bham Bole) సాంగ్ లిరిక్స్ – ఇంద్ర (Indra)

by Rahila SK
0 comment
265

భంభం భోలే శంఖం మోగేలే
ఢంఢం ఢోలే చలరేగిందిలే
భంభం భోలే శంఖం మోగేలే
ఢంఢం ఢోలే చలరేగిందిలే

దద్ధినక ధిన్ దరువై సందడి రేగనీ
పొద్దులెరుగని పరుగై ముందుకు సాగనీ
దద్ధినక ధిన్ దరువై సందడి రేగనీ
పొద్దులెరుగని పరుగై ముందుకు సాగనీ

విలాసంగా శివానందలహరి
మహగంగ ప్రవాహంగా మారి
విశాలాక్షి సమేతంగ చేరీ
వరాలిచ్చె కాశీపురీ

భంభం భోలే శంఖం మోగేలే
ఢంఢం ఢోలే చలరేగిందిలే

దద్ధినక ధిన్ దరువై సందడి రేగనీ
పొద్దులెరుగని పరుగై ముందుకు సాగనీ

విలాసంగా శివానందలహరి
మహగంగ ప్రవాహంగా మారి
విశాలాక్షి సమేతంగ చేరీ
వరాలిచ్చె కాశీపురీ

భంభం భోలే భంభం భోలే
భంభం భోలే భోలేనాథ్
భంభం భోలే భంభం భోలే
భంభం భోలే భోలేనాథ్

భోలే నాచే చంకుచమాచం
భోలే నాచే చంకుచమాచం
ఢమరూ భాజే ఢమరూ భాజే
ఢమరూ భాజే ఢంఢమాఢం

భోలే నాచే చంకుచమాచం
భోలే నాచే చంకుచమాచం

వారణాసిని వర్ణించే నా గీతికా
నాటి శ్రీనాధుని కవితై వినిపించగా
ముక్తికే మార్గం చూపే మణికర్ణికా
అల్లదే అంది నా ఈ చిరు ఘంటిక

నమక గమకాలై ఎద లయలే కీర్తన చేయగా
జమక గమకాలై పద గతులే నర్తన చేయగా
ప్రతి అడుగు తరిస్తోంది ప్రదక్షిణగా

విలాసంగా శివానందలహరి
మహగంగ ప్రవాహంగా మారి
విశాలాక్షి సమేతంగ చేరీ
వరాలిచ్చె కాశీపురీ

కార్తీక మాసాన వేవేల దీపాల
వెలుగంత శివలీల కాదా
ప్రియమార మదిలోన ఈశ్వరుని ధ్యానిస్తే
మన కష్టమే తొలగిపోదా

ఏ దందమాదం దం దమాదం దమాదం
దందమాదం దం దమాదం దమాదం
దందమాదం దం దందమాదం దం
దందమాదం దం దమాదందం దం దం దం

ఎదురయే శిల ఏదైన శివలింగమే
మన్ను కాదు మహాదేవుని వరదానమే
చిరంజీవిగా నిలిచింది ఈ నగరమే
చరితలకు అందనిది ఈ కైలాసమే

గాలిలో నిత్యం వినలేదా ఆ ఓంకారమే
గంగలో నిత్యం కనలేదా శివ కారుణ్యమే
తరలిరండి తెలుసుకోండి కాశి మహిమా

విలాసంగా శివానందలహరి
మహగంగ ప్రవాహంగా మారి
విశాలాక్షి సమేతంగ చేరీ
వరాలిచ్చె కాశీపురీ

భంభం భోలే శంఖం మోగేలే
ఢంఢం ఢోలే చలరేగిందిలే

దద్ధినక ధిన్ దరువై సందడి రేగనీ
పొద్దులెరుగని పరుగై ముందుకు సాగనీ
దద్ధినక ధిన్ దరువై సందడి రేగనీ
పొద్దులెరుగని పరుగై ముందుకు సాగనీ

విలాసంగా శివానందలహరి
మహగంగ ప్రవాహంగా మారి
విశాలాక్షి సమేతంగ చేరీ
వరాలిచ్చె కాశీపురీ


పాట: భంభం (Bham Bham Bole)
గీతరచయిత: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గాయకులు: హరిహరన్, శంకర్ మహదేవన్
చిత్రం: ఇంద్ర (2002)
తారాగణం: ఆర్తి అగర్వాల్, చిరంజీవి, సోనాలి బింద్రే
సంగీత దర్శకుడు: మణి శర్మ

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చుడండి.

You may also like

Leave a Comment

Exit mobile version