Home » స్పైరులినా: రోజు ఒక్క స్పూన్ తీసుకుంటే మీకు సర్వ రోగాల నుంచి విముక్తి

స్పైరులినా: రోజు ఒక్క స్పూన్ తీసుకుంటే మీకు సర్వ రోగాల నుంచి విముక్తి

by Nikitha Kavali
0 comment

నేటి కాలం లో మనకి సామాజిక మాధ్యమాలలో స్పైరులినా (spirulina) అనే ఒక ఫుడ్ సప్లిమెంట్ బాగా వినిపిస్తుంది. దీంట్లో ఎన్నో పోషకాలు ఉన్నాయని, రానున్న కాలం స్పైరులినా ఒక స్థిరమైన ఆహార పదార్థం గా మనం తీసుకుంటాము అని పరిశోధకులు చెబుతున్నారు. స్పైరులైన లో మనిషి బ్రతకడానికి కావలసిన అన్ని పోషకాలు ఎంతో పుష్కలంగా ఉన్నాయని నిపుణులు చెబితున్నారు. ఈ స్పైరులినా మనకి పొడి గా లేదా టాబ్లెట్ లలో దొరుకుతుంది.

స్పైరులినా అసలు ఎక్కడ పెరుగుతుంది:

స్పైరులినా అనేది సైనోబాక్టెరియా అనే బ్లూ గ్రీన్ ఆల్గే జాతికి చెందినది. ఇది మంచి నీరు మరియు సముద్రపు నీళ్లల్లో పెరుగుతుంది. నేటి కలం లో స్పైరులినా సాగు చేసి పెంచడం అనేది కూడా ఒక మంచి లాభాలు తెచ్చే పని గా ప్రాముఖ్యత చెందుతుంది. అసలు ఈ ఈ స్పైరులినా తీసుకోవడం వలన మనకి ఏమి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందా రండి.

స్పైరులైన లో ఉండే పోషక విలువలు:

100 గ్రాముల స్పైరులినా లో 57.7 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది, ఇంకా 8గ్రామాలు ఒమేగా 3 ఫ్యాట్టి యాసిడ్లు, 24 గ్రాముల కార్బొహైడ్రట్లు, ఇంకా కాల్షియమ్, ఐరన్, కాపర్, థైమిన్, రిబోఫ్లావిన్, నియాసిన్ ఇలా బోలెడు న్యూట్రియెంట్లు ఈ స్పైరులినా లో లభిస్తున్నాయి. ఇది ఒక అద్భుతమైన ఔషదాలు ఉన్న ఆహార పదార్థం.

ఒక్క టేబుల్ స్పూన్ స్పైరులినా లో,

  • 20 కెలోరీలు
  • 4గ్రాముల ప్రోటీన్
  • 1 గ్రాము ఫ్యాట్
  • 1.7గ్రాముల కార్బోహైడ్రాట్లు
  • 8.4 మిల్లి గ్రాముల కాల్షియమ్
  • 2 మిల్లి గ్రాముల ఐరన్

శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది

స్పైరులినా లో అధికంగా యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉంటాయి. దీని వలన మన శరీరం లో ఉండే కణాలు(cells) త్వరగా డామేజ్ అవ్వకుండా ఉపయోగపడుతుంది మరియు యవ్వనంగా కనపడేందుకు తోడ్పడుతుంది.

యాంటీ కాన్సర్ ఏజెంట్లు:

    2021 లో జరిగిన పరిశోధనల మేరకు స్పైరులినా లో కాన్సర్ కణాలతో పోరాడే శక్తీ ఉంది అని తెలిపాయి. ఇది మన శరీరం లో ఉండే కణాలను కాన్సర్ కణాలు గా మారకుండా మరియు కాన్సర్ కణాలు పెరగకుండా ఉండడానికి కొంచెం సహాయపడుతుంది.

    రక్తపోటు ను నియంత్రిస్తుంది:

      స్పైరులినా ను రక్తపోటు తో బాధపడేవారు ప్రతి రోజు ఆహరం లో తీసుకోవడం వలన క్రమంగా రక్త పోటు తగ్గుముఖం పెట్టె అవకాశాలు బలంగా ఉన్నాయి అని పరిశోధకులు చెబుతున్నారు.

      రక్త హీనతను అరికడుతుంది:

        స్పైరులినా లో అధిక శాతం ఐరన్ ఉండడం వలన మన రక్తం లో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచేదానికి తోడ్పడుతుంది. అనీమియా తో బాధ పడే వారు ప్రతి రోజు స్పైరులినా ను తీసుకోవడం వలన రక్త హీనత నుండి విముక్తి పొందవచ్చు.

        బలమైన కండరాలు పెరుగుదలకు సహాయపడుతుంది:

          నేటి కాలం లో యువత దృఢమైన కండరాల కోసం జిమ్ కు వెళ్లి ఎన్నో కసరత్తులు చేస్తున్నారు. అలంటి వాళ్ళు రోజు తాము తీసుకునే ప్రోటీన్ షేక్ లో రెండు స్పూన్ల స్పైరులినా పొడి ని వేసుకొని తాగితే ఇంకా బలం చేకూరి దృఢమైన కండరాలు ఏర్పడడం లో సహాయపడుతుంది.

          జీర్ణ సంబంధిత వ్యాధులను నియంత్రిస్తుంది:

            స్పైరులినా మన పొట్టలో జీర్ణ వ్యవస్థ మెరుగు గా పనిచేసేందుకు సహాయపడే బాక్టీరియా ను పెరిగే ల చేస్తుంది. అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలను కూడా స్పైరులినా దూరం పెడుతుంది.

            ఇలా ఇన్ని ఉపయోగాలు ఉన్న స్పైరులినా ను మనము కచ్చితంగా మన రోజు ఆహారం తో తీసుకుంటే ఎంతో ఆరోగ్యమైన జీవితం మనం గడపవచ్చు.

            మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ టిప్స్ ను సందర్శించండి.

            You may also like

            Leave a Comment