బీరంగూడ మల్లికార్జున బ్రహ్మరాంబ ఆలయం గురించి తెలుసా!. బీరంగూడ మల్లికార్జున బ్రహ్మరాంబ దేవాలయం భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా బీరంగూడ గ్రామంలో ఉంది. ఇక్కడ మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబ దేవి వెలిశారు. ఇది శ్రీశైలం లో ఉన్న ఆలయం లాంటి మరొక ఆలయం. పూర్వం మన పూర్వికులు శ్రీశైలం వెళ్ళలేక కాలినడకనా ఇక్కడికే వచ్చి టెంకాయలు సమర్పించేవారు. తమ మొక్కులను తీర్చుకునే వారు.
భృగమహర్షి ప్రతిష్టించిన శివ లింగం గురించి తెలుసుకుందాం. 5 అంతస్థుల రాజగోపురం కనుసొంపుగా ఉంటుంది. గోపురం పైన పంచ కలశాలు ఉంటాయి. శివలింగం చాతురస్రా ఆకారంలో ఉంటుంది. గర్భ గుడిలో మల్లికార్జున స్వామి నాలుగు స్థంబాల రజిత మండపంలో పానవటం ఫై లింగ ఆకారంలో పూజలు అందుకుంటున్నారు. స్వామి వారికీ నిత్య పూజలు రుద్ర అభిషేకాలు జరుగుతూవుంటాయి. మారేడు ఆకులతో అభిషేకించి స్వామి వారిని పూజిస్తూ ఉంటారు. గర్భాలయం వెనక వైపున బ్రహ్మరాంబ దేవి ఉంటుంది. ఇక్కడ అమ్మవారు కూడా శ్రావణ మాసం లోను, దసరా నవరాత్రుల లోను ప్రత్యక మైన అలంకారాలతో దర్శనమిస్తుంది. నిత్యం కుంకుమ పూజలు జరుగుతూ ఉంటాయి. ఎక్కువుగా సోమవారం నాడు భక్తులు వస్తూవుంటారు. మిగతా రోజులో జనాలు చాలా తక్కువుగా వస్తుంటారు.
ఈ ఆలయంలో మహా శివరాత్రి, కార్తీక మాసం, మరియు బ్రహ్మోత్సవాలతో సహా సంవత్సరం పొడవునా వివిధ పండుగలను జరుపుకుంటారు. ఈ ఉత్సవాల్లో, భక్తులు సుమారు 5,6 లక్షల మంది స్వామి, అమ్మవార్లను దర్శించుకొనేందుకు మరియు ఉత్సవాల్లో పాల్గొనడానికి ఆలయానికి వస్తారు.
ఈ ఆలయం పురాణం, భృగుమహర్షి తపస్సు చేస్తున్నపుడు వారి భక్తి కి మెచ్చి మల్లికార్చున స్వామి ప్రత్యక్షమయ్యారంట. ఈ ప్రాంతం లో భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం ఎల్లపుడు ఉండాలని మహర్షి కోరేరంటా. అందుకు అంగీకరించిన అదిదంపతులు ఇక్కడ బీరంగుట్ట మీద వెలిశారని చెబుతూవుంటారు. ఈ ఆలయం లో ఒక గుహ ఉంది. గుట్ట పైన వున్నా ఆనవాళ్లను బట్టి ఈ గుహ శ్రీశైలం వెళ్లేందుకు స్వరంగ మార్గం అని భక్తుల నమ్మకం.
ఈ దేవాలయం 6 వ శతాబ్దం లోనే నిర్మించినట్టు ఇక్కడ ఉన్న శాసనాలు చెబుతున్నాయి. చాణుక్యులు, రాష్ట్రకూటులు కళ్యాణి చాణుక్యులు తదితర రాజులు కాలంలో ఈ దేవాలయం గొప్ప దేవాలయంగా విరాజిల్లిదంటా.
ఈ ఆలయ గోడలు, స్తంభాలు మరియు పైకప్పుపై శిల్పాలు అద్భుతమైన నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ఆలయ ప్రగణం లో వినాయక స్వామి, కుమార స్వామి , మరియు ఆంజనేయ స్వామి లకు కూడా చిన్న చిన్న ఆలయాలు వున్నాయి.
షూటింగ్ స్పాట్: ఈ ఆలయం పరిసారాల్లో చాలా ఎక్కువ ప్లేస్ ఉంటుంది కాబట్టి చాలా సినిమాలకు ఇక్కడే షూటింగ్ జరుగుతుంది. “ఫుష్ప” సినిమాలో “ఏ పిట్టా ఇది న అడ్డా” అనే పాటకు షూటింగ్ ఇక్కడే షూట్ చేసారు. “బింబిసారా” సినిమాలో కళ్యాణ్ రామ్ “ఈశ్వరుడే ఈశ్వరుడే” సాంగ్ ఇక్కడే చేసారు. “కందిరీగ” సినిమాలో హీరో రామ్ కి హీరోయిన్ కి మధ్య ఒక సీన్ ఈ గుడిలోనే షూట్ చేసారు. “గుడుంబ శంకర్” లో పవన్ కళ్యాణ్ హీరోయిన్ ని చూస్తూ ఒక సీన్ ఉంటది అది ఈ ప్లేస్ లోనే. “లౌక్యం” సినిమాలో హీరో గోపీచంద్ హీరోయిన్ రఖుల్ రకుల్ ప్రీత్ సింగ్ ని మొదటిసారి చుసిన సీన్ ఇక్కడే జరిగింది. “బావగారు బాగున్నారా” సినిమాలో చిరంజీవి నంది లో నుంచి రంభ ను చూసే సీన్ ఇక్కడే జరిగింది. “భలే భలే మగాడివోయ్”సినిమాలో హీరో నాని శ్రీశైలం అని చెప్పి మర్చిపోయి వేరే గుడికి తీసుకుని వెళ్తాడు కదా! ఆ గుడి మరేదో కాదు ఇదే. ఇంకా 90 మాల్ , కితకితలు , బ్రాండ్ బాబు 50+ సినిమాల షూటింగ్లు జరిగాయంట.
ఈ ఆలయం చాలా అందంగా ఉంటుంది మీరు తప్పక సందర్శించాల్సిన దేవాలయం. మన హీరోలు నటించిన స్థలాన్ని మనకి కూడా చూడాలని అనిపిస్తుంది కదా!. అయితే ఆలస్యం లేకుండా వెళ్లి మీరు కూడా చేసేయండి.
సమయాలు: ఆలయం ఉదయం 6:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు మరియు సాయంత్రం 4:00 నుండి రాత్రి 8:00 వరకు తెరిచి ఉంటుంది.
వసతి: భక్తులు సమీపంలోని సిద్దిపేట పట్టణంలో వసతి గ్రహములలో ఉండవచ్చు. అక్కడ వివిధ హోటళ్ళు మరియు లాడ్జీలను ఉంటాయి.
ఎలా చేరుకోవాలి: హైదరాబాద్ మరియు వరంగల్ వంటి ప్రధాన నగరాలకు అనుసంధానించబడిన సిద్దిపేట నుండి ఈ ఆలయానికి రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. సమీప విమానాశ్రయం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఇది 100 కి.మీ దూరంలో ఉంది.
బీరంగూడ మల్లికార్జున బ్రహ్మరాంబ ఆలయం(exact location):
మరిన్ని ఇటువంటి ఆలయాల కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.