Home » అందరికి అందుబాటులో వుండే పంచదారతో సౌందర్య చిట్కాలు

అందరికి అందుబాటులో వుండే పంచదారతో సౌందర్య చిట్కాలు

by Vinod G
0 comments
beauty tips with sugar

హాయ్ తెలుగు రీడర్స్ ! ప్రస్తుత కాలంలో ఎవరైతే ఆరోగ్యంగా వున్నారో వారిని ఐశ్వర్యవంతులని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాలం మారుతున్న కొద్దీ రక రకాల జబ్బులు వస్తున్నాయి. ఆరోగ్యం మీద ఎంత ద్రుష్టి పెట్టినా కూడా ఎదో ఒక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. సాధారణంగా ఆరోగ్యం పై శ్రద్ధ చూపే వారందరూ ఎక్కువగా దూరం పెడుతున్న నిత్యావసర వస్తువులలో పంచదార కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు.

అయితే మనం దూరం పెడుతున్న పంచదార వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా! ఈ పంచదార సౌందర్య పోషణలో కీలకపాత్ర పోషిస్తుందని అంటున్నారు నిపుణులు . అదెలాగంటారా ? అయితే తెలుసుకుందాం !

  • కొద్దిగా చక్కెర తీసుకొని అందులో పాలు, తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంతో రోజు రాత్రి పూట పడుకునే ముందు పెదవులకు మెల్లగా మర్దన చేసుకుంటే మీ పెదవులు ఎర్రటి గులాబీ రేకులలాగా తయారవుతాయి. అయితే ప్రతి మూడు రోజులకు ఒకసారి ఈ చిట్కా పాటిస్తేనే సత్ఫలితాలు పొందవచ్చు.
  • కొద్దిగా చక్కెర తీసుకొని అందులో మీకు నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్ కొన్ని చుక్కలు వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని కాసేపు మృదువుగా మర్ధన చేసుకోవాలి. తర్వాత చల్లని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మళ్లీ కొత్త కళను సంతరించుకుంటుంది.
  • చక్కెర తీసుకొని అందులో నిమ్మరసం వేసి బాగా కలుపుకొని ముఖానికి రాసుకోవాలి. ఆరిన తర్వాత తడి గుడ్డతో తుడుచుకోవాలి. దీనివల్ల సూర్యరశ్మిలో ఎక్కువ సమయం ఉండటం వల్ల ఎదురయ్యే ట్యానింగ్, పిగ్మెంటేషన్, చర్మం ముడతలు పడడం వంటి సమస్యలకు పరిష్కారంగా ఉపయోగపడుతుంది.
  • ఒక గిన్నెలో కొంచెం గంధం, రోజ్ వాటర్, ఒక స్పూన్ పంచదార వేసి బాగా కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల మీ ముఖ ఛాయా పెరుగుతుంది.

చూసారా మనం ఆరోగ్యానికి మంచిది కాదనుకున్న పంచదార వలన ఎన్ని ప్రయోజనాలో !

ఇటువంటి మరిన్ని బ్యూటీ టిప్స్ కోసం తెలుగు రీడర్స్ బ్యూటీ ని సందర్శించండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.