Home » బ్రతకమంటూ బ్రతుకునిచ్చి సాంగ్ లిరిక్స్, 777 charlie

బ్రతకమంటూ బ్రతుకునిచ్చి సాంగ్ లిరిక్స్, 777 charlie

by Lakshmi Guradasi
2.5K views
bathakamantu bathukunichi song lyrics 777 charlie

రెహమ్ మేరె ఖుదా
రెహమ్ మేరె ఖుదా
రెహమ్ మేరె ఖుదా

బ్రతకమంటూ బ్రతుకునిచ్చి
బ్రతకనివ్వవు వివరమేంటయ్యా
ఎవరు అడిగే నిన్ను ప్రాణం
ఎందుకిచ్చావ్ జీవి జన్మం

ఘోరమైన విధిని రాసే
క్రూరమైన మనసు నీదయ్యా
తీపి చూపి చేదునిస్తూ
బంధమిచ్చి బాధనిస్తూ
తెగే..! తెగేనని తెలిసి
మనసుల ముడులు వేస్తావా

వినవా.. వినవా ఒక మూగ గొంతుక ప్రార్థన
కనవా.. కనవా ఒక ప్రాణ బంధపు వేదనా
వినవా వినవా ఒక మూగ గొంతుక ప్రార్థన
వినవా కనవా.. ఓ ఓ ఓ

చూడు కథలో మలుపే
తీసే మరణపు తలుపే
కాలమే రాసిన విద్రోహ విష కథనం
నిన్న నవ్విన నవ్వుల వెనక
ఇంత దుఃఖముందా నయవంచకా

కంటిరెప్పంచునా ఏడు సంద్రాలనే
ఉంచి పొంగించొద్దు ఆపెయ్ ఈ ఆటనే
ఎందుకీ శోఖము, అసలెందుకీ శాపము
ప్రాణాలతో చెలగాటము, చూపిక జాలి గుణము

వినవా.. వినవా ఒక మూగ గొంతుక ప్రార్థన
కనవా.. కనవా ఒక ప్రాణ బంధపు వేదనా
వినవా వినవా ఒక మూగ గొంతుక ప్రార్థన
వినవా కనవా.. ఓ ఓ ఓ

వాన చినుకే పడెనే
దాచి పిడుగుల జడినే
తొలకరే ప్రళయమై
కావలించినది అరెరే

వేడుకుంటున్నా వినవా వ్యధనే
మార్చి రాసేయవా తలరాతనే
నా ఆయుష్షులో సగం తీసేసుకో
ఏదో వరమిచ్చి ప్రాణాన్నే కాచుకో

ఇవ్వడం ఎందుకు
లాక్కోవడం ఎందుకు
నిస్వార్ధపు స్నేహాలకు
ఈ శిక్షే ఎందుకొరకు

వినవా.. వినవా ఒక మూగ గొంతుక ప్రార్థన
కనవా.. కనవా ఒక ప్రాణ బంధపు వేదనా
వినవా వినవా ఒక మూగ గొంతుక ప్రార్థన
వినవా కనవా.. ఓ ఓ ఓ

___________

సాంగ్ : బ్రతకమంటూ బ్రతుకునిచ్చి (Bathakamantu Bathukunichi)
చిత్రం; 777 చార్లీ (777 Charlie)
సంగీతం: నోబిన్ పాల్ (Nobin Paul)
గాయకులు: KS హరిశంకర్ (KS Harisankar)
లిరిసిస్ట్: బట్టు విజయ్ కుమార్ (Battu Vijay Kumar)
నటీనటులు: చార్లీ (Charlie), రక్షిత్ శెట్టి (Rakshit Shetty),
రచన & దర్శకత్వం: కిరణ్‌రాజ్ కె (Kiranraj K)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.