నీ ఇష్టం సర్లే కానీ
ఇచ్చేశా నిన్నే నీకే
ఆనందంగా బతకవే పో..
తీరేదే కాదే నా ప్రేమ
ఆరిపోని వెన్నెలే మారిపోనే పొదులే
నీ ఇష్టం సర్లే కానీ
ఇచ్చేశా నిన్నే నీకే
ఆనందంగా బతకవే పో..
ఈ భారం పోయేదే కాదే
అయినా చెలీ సెలవంటున్నానే
ఏ రేపు నీ చూపు నావైపు రాకున్నా వెయ్యేళ్ళు బాగుండుపో
ఏకాకి లోకనా ఎలాగా నేనున్నా నువ్వైనా బాగుండుపో
గాయమే కానీవే
గుండెలే పెరికేసానే
నిన్ను నీకిచ్చేసానే నవ్వుతూనే
ఎవ్వరినీ ఏమంటానే
నేరమే నాదంటానే
శిక్షగా చివరంటానే
శూన్యమై మిగిలుంటానే
వేరొకరి చేతుల్లో
నీ చెయ్యి చూస్తున్నానే
బరువుగా నిట్టూర్చా బాధలోనే
నిన్న నీ కన్నుల్లోనే
కాటుకై ఉన్నది నేనే
నా కంటి నీళ్లతో నన్నే
నేడిలా చేరిపేసావే
ఏ రేపు నీ చూపు నావైపు రాకున్నా వెయ్యేళ్ళు బాగుండుపో
ఏకాకి లోకనా ఎలాగా నేనున్నా నువ్వైనా బాగుండుపో
ఇంకెవరితోనో నీ జంట
నువ్వులేని నాకు ఎదమంట
ముక్కలైన నాకు దిక్కు తోచదంట
అయినా వెళ్ళిపో
నన్ను దాటి పోవే పొమ్మంటా
మళ్లీ ఇటు రానే వద్దంటా
అంతులేని ప్రేమ అక్షతలు వేసి
దీవించలే పో
In English Version:
Nee Ishtam Sarle Kaanee
Ichesaa Ninne Neeke
Aanandamgaa Bathakave Po
Theeredhe Kaadhe Naa Prema
Aariponi Vennele Maaripone Podhule
Nee Ishtam Sarle Kaanee
Ichesaa Ninne Neeke
Aanandamgaa Bathakave Po
Ee Bhaaram Poyedhe Kaadhe
Ayinaa Cheli Selavantunnane
Ae Repu Neechoopu Naavaipu Raakunnaa Veyyellu Baagundu Po
Aekaaki lokana Ellaaga Nenunaa Nuvvaina Baagundu Po
Gaayame Kaaneeve
Gundele Perikesane
Ninnu Neekichesane Navvuthoone
Evvarini Emantaane
Nerame Naadhantane
Sikahaga Chivarantaa Ne
Soonyamai Migiluntane
Verokari Chethullo
Nee Cheyi Choosthunnane
Baruvugaa Nittoorchaa Baadhlone
Ninna Nee Kannullone
Kaatukai Unnadhi Nene
Naa Kanti Neellatho Nanne
Nedilaa Cheripesaave
Ae Repu Neechoopu Naavaipu Raakunnaa Veyyellu Baagundu Po
Aekaaki lokana Ellaaga Nenunaa Nuvvaina Baagundu Po
Ae Inkevarithono Nee Janta
Nuvvuleni Naaku Edhamanta
Mukkalaina Naaku
Dhikku Thochadhanta
Ayinaa vellipo
Nannu Dhaati Pove Pommantaa
Malli Itu Raane Vaddhanta
Antuleni Prema Akshathalu Vesi
Deevinchale Po
______________________
Song Credits:
సాంగ్: బాగుండు పో (Baagundu po)
ఆల్బమ్: డ్యూడ్ (Dude)
సంగీతం: సాయి అభ్యాంకర్ (Sai Abhyankar)
గాయకులు: సంజిత్ హెగ్డే (Sanjith Hegde)
సాహిత్యం: “సరస్వతి పుత్ర” రామజోగయ్య శాస్త్రి (“Saraswathi puthra” Ramajogayya sastry)
నటీనటులు: ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan), మమితా బైజు (Mamitha Baiju)
రచన & దర్శకత్వం: కీర్తీశ్వరన్ (Keerthiswaran)
See Also: boom boom song lyrics dude
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.