పాట: అటు నువ్వే ఇటు నువ్వే
గీతరచయిత: రామజోగయ్య శాస్త్రి
గాయకులు: నేహా భాసిన్
అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చుస్తే అటు నువ్వే
ఎటు వెళ్తున్న ఎం చేస్తున్న ప్రతిచోటా నువ్వే
అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే
అధమరపైనా పెదవుల పైనా ప్రతి మాట నువ్వే
అప్పుడో ఇపుడో ఎపుడైనా నా చిరునవ్వే నీవలన
తెలియని లోకం తీపిని నాకు రుచి చూపావులే
పరిచయమంతా గతమేనా గురుతుకు రానా క్షణమైనా
ఎదురుగా వున్నా నిజమేకాని కళావైనావులే
రంగు రూపమంటూ లేనే లేనిదీ ప్రేమా
చుట్టూ శున్యంఉన్న నిన్ను చూపిస్తూ వుంది
దూరం దగ్గరంటూ తేడా చూడది ప్రేమ
నీల చెంత చేరి నన్ను మాటాడిస్తుంది
కనుపాప లోతులో దిగీపోయింతలా
ఒక రెప్పపాటు కాలమైనా మరుపే రావుగా
యద మారు మూలలో ఒదిగిన్న ప్రాణమై
నువ్వు లేని నేను లేనే లేను అనిపించావుగా
అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చుస్తే అటు నువ్వే
ఎటు వెళ్తున్న ఎం చేస్తున్న ప్రతిచోటా నువ్వే
అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే
అధమరపైనా పెదవుల పైనా ప్రతి మాట నువ్వే
నాకే తెలియకుండా నాలో నిన్ను వొదిలావే
నేనే నువ్వయేలా ప్రేమ గుణమై ఎదిగావే
మాటే చెప్పకుండా నీతో నువ్వు కదిలావే
ఇటుగా చూడనంటూ నన్ను ఒంటరి చేసావే
ఏకాంత వేళలో ఏయ్ కాంతి లేదు ర
నలుసంత కూడ జాలి లేని పంతాలేంటి ఇలా
నీతోడు లేనిదే మనసుండలేదు ర
నీ పేరు లేని ప్రేమ నైనా ఊహించేదెలా
అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చుస్తే అటు నువ్వే
ఎటు వెళ్తున్న ఎం చేస్తున్న ప్రతిచోటా నువ్వే
అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే
అధమరపైనా పెదవుల పైనా ప్రతి మాట నువ్వే
మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.