Home » అరెరే మనసా (Arerey Manasa ) సాంగ్ లిరిక్స్ ఫలక్‌నుమా దాస్ (Falaknuma Das) 

అరెరే మనసా (Arerey Manasa ) సాంగ్ లిరిక్స్ ఫలక్‌నుమా దాస్ (Falaknuma Das) 

by Lakshmi Guradasi
0 comments
Arerey Manasa song lyrics Falaknuma Das

ఏమన్నావో ఎదతో తెలుసా
ప్రేమనుకోనా మనసా…
చూడకముందే వెనకే నడిచే
తోడొకటుంది కలిసా…

తెలియదే అడగడం
ఎదురై నువ్వే దొరకడం
మాయనో ఏమిటో ఏమో

అరెరే మనసా
ఇదంతా నిజమా….
ఇకపై మనమే
సగము సగమా…..

ఏమన్నావో ఎదతో తెలుసా
ప్రేమనుకోనా మనసా…

ఆ నా బ్రతుకున ఏ రోజో
ఏ పరిచయమవుతున్నా నేనడిగినదే లేదే
కాదనుకుని పోతున్నా…
ఇన్నాళ్ళుగ నా వెనకున్నది నువ్వేనని తెలియదులే
నూరేళ్ళకు అమ్మగ మారిన తోడే నువ్వే..

ఆ’ ఊరంతా మహరాజైనా
నీ ఒళ్ళో పడిపోయాక
దాసుడనైపోయానే…

అరెరే మనసా
ఇదంతా నిజమా….
ఇకపై మనమే
సగము సగమా….

నేనడిగిన రాగాలు
నీ ప్రణయపు మౌనాలు
నీ కురుల సమీరాలు
నే వెతికిన తీరాలు
ఇన్నాళ్ళుగ నా ఉదయానికి
ఎదురైనది శూన్యములే
తొలిసారిగ నీ ముఖమన్నది నా వేకువలే

ఓ.. ప్రాణాలే అరచేతుల్లో
పెట్టిస్తూ నా ఊపిరితో సంతకమే చేస్తున్నా….

అరెరే మనసా
ఇదంతా నిజమా….
ఇకపై మనమే
సగము సగమా….

అరెరే మనసా
ఇదంతా నిజమా…
ఇకపై మనమే
సగము సగమా….

అరెరే మనసా
ఇదంతా నిజమా…
ఇకపై మనమే
సగము సగమా… ఆ ..

_________________________

సినిమా – ఫలక్‌నుమా దాస్ (Falaknuma Das)
పాట – అరెరే మనసా (Arerey Manasa )
మ్యూజిక్ : వివేక్ సాగర్ (Vivek Sagar)
గానం: సిద్ శ్రీరామ్ (Sid Sriram)
సాహిత్యం: కిట్టు విస్సాప్రగడ (Kittu Vissapragada)
నటనలు: విశ్వక్ సేన్ (Vishwak Sen), సలోని మిశ్రా (Saloni Misra),
దర్శకత్వం: విశ్వక్ సేన్ (Vishwak Sen)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి .

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.