కళ్ళకు అలసటగా అనిపిస్తే దానిని విస్మరించకూడదు. చిన్న చిన్న విషయాల పట్ల కేరింగ్ తీసుకున్నా కళ్లు రిలాక్స్‌గా ఉంటాయి. స్క్రీన్‌ని నిరంతరం చూస్తూ పని చేస్తూ ఉంటే లేదా ఎక్కువగా చదివి కళ్ళకు తగిన విశ్రాంతి ఇవ్వకపోతే కంటి చూపు బలహీనంగా మారవచ్చు. కనుక ఈ రోజు కంటికి రిలాక్స్ ఇచ్చే కొన్ని సాధారణ చిట్కాలను గురించి తెలుసుకుందాం..వీటిని అనుసరించడం ద్వారా కళ్లలో తాజాదనాన్ని పొందవచ్చు.
మీరు పని నుండి వచ్చిన తర్వాత కళ్ళు చాలా అలసిపోయినట్లు అనిపిస్తే కోల్డ్ కంప్రెస్ దీని కోసం ఉపయోగించవచ్చు. మీకు కావాలంటే జెల్ ఐస్ ప్యాక్‌లను తీసుకోవచ్చు లేదా చల్లటి నీటిలో మెత్తని గుడ్డను ముంచి, దానిని కళ్ళపై కొద్దిసేపు ఉంచవచ్చు. రెగ్యులర్ వ్యవధిలో రెండు మూడు సార్లు బట్టలు మార్చండి. ఇలా చేయడం వలన చాలా ఉపశమనం కలిగుతుందని నిపుణులు చెప్పారు.
కంప్యూటర్ దగ్గర ఎక్కువ సమయం పని చేస్తున్నప్పుడు.. ఎక్కువ కాంతి కళ్లపై పడుతుంది. దాని కారణంగా కళ్ళు అలసిపోతాయి. దీని నుంచి ఉపశమనం పొందడానికి విశ్రాంతి తీసుకోండి. బహిరంగ ప్రదేశంలో స్వచ్చమైన గాలిని పీల్చుకోవడానికి.. సహజ కాంతిలో బయటకు వెళ్లండి.
కళ్ళకు మసాజ్: పని చేస్తున్నప్పుడు కళ్ళు అలసిపోయినట్లు అనిపిస్తే, 20 నుండి 30 సెకన్ల విరామం తీసుకోండి. కళ్ళు మూసుకుని కను రెప్పల మీద వేళ్లతో తేలికపాటి వృత్తాకార కదలికలలో మసాజ్ చేయండి. మీ అరచేతులను ఒకదానితో ఒకటి రుద్దండి. వాటిని కళ్ళపై కొద్దిసేపు ఉంచండి. ఇలా చేయడం కంటి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. చాలా విశ్రాంతిని పొందుతారు.
ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ టిప్స్ ను సందర్శించండి.