హాయ్ తెలుగు రీడర్స్ ! ఏంటి పవర్ స్టార్ పవన్ సింగర్ అవతారమెత్తడమేంటి అనుకుంటున్నారా? అవునండోయ్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కొన్ని చిత్రాలలో స్వరం కదిపాడు. అలా స్వరం కలిపిన వాటిలో కొన్నింటిలో ఫస్ట్ పోర్షన్ గా, మరి కొన్నింటిలో సైడ్ పోర్షన్ గా, ఇంకొన్నిటిలో డైరెక్ట్ గా పాడేశారు. ఇప్పుడు మనం ఏమేమి పాటలు పాడేరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మొదటగా ‘తమ్ముడు(Thammudu)’, ఇది 1999లో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో విడుదలైన ప్రముఖ తెలుగు సినిమా. ఈ సినిమాలో నటన, గుర్తుండిపోయే మాటలు మరియు రమణ గోగుల స్వరపరిచిన ప్రసిద్ధ సంగీతం సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ఈ సినిమాలో కాంటీన్ లో సరదాగా ఫ్రెండ్స్ తో కాంటీన్ లో పనిచేసే మల్లి అనే అతని మీద పాడే కామెడీ పాట ‘తాటి సెట్టెక్కలేవు తాటి కల్లు తెంపలేవు(THATI CHETTU)‘ అనే బిట్ సాంగ్ ను స్వయంగా పవన్ కళ్యాణ్ గారు మొట్ట మొదటిగా పాడడం జరిగింది. తరువాత అదే సినిమాలోని ‘ఎం పిల్ల మాటాడవా (EM PILLA)‘ అనే మరొక బిట్ సాంగ్ ను కూడా పాడడం జరిగింది.
అలాగే 2001లో విడుదలైన ‘ఖుషి(kushi)’ సినిమాకి S.J. సూర్య దర్శకత్వం చేయగా , A.M. రత్నం నిర్మించారు. ఈ చిత్రానికి మణి శర్మ స్వరపరిచిన ఆకర్షణీయమైన సంగీతానికి ఆడియన్స్ లో మంచి ఆదరణ వచ్చింది. దీంతో పాటు ఇది కుర్రకారుకు నచ్చే ప్రేమ కథా చిత్రం కావడంతో ఈ సినిమా మంచి సూపర్ హిట్ ను అందుకుంది. ఈ సినిమాలో అలీ కి పవన్ కు మధ్యన జరిగే డ్రింక్ సీన్లో వచ్చే ‘బైబైయ్యే బంగారూ రమణమ్మా(BAI BAIYE BANGARU RAMANAMMA)‘ అనే ఫన్నీ బిట్ సాంగ్ ను పవన్ కళ్యాణ్ గారు పాడడం జరిగింది.
తరువాత పవన్ స్వీయ దర్సకత్వం వహించిన ‘జానీ(Johnny)’ సినిమాలోను స్వరం కదిపారు. ఈ చిత్రానికి రమణ గోగుల అందించిన సంగీతం మంచి ఆదరణ పొందింది. ఈ చిత్రంలో పవన్ రెండు పాటలను పాడారు. అందులో మొదటిది ‘నువ్వు సారా తాగుట మానురన్నో(NUVVU SARA TAGUTA)‘ అనే బిట్ సాంగ్ పాడారు. అలాగే మరొక సాంగ్ ‘రావోయి మా ఇంటికి(RAVOYI MAA INTIKI)‘ అనే బిట్ సాంగ్ ను పాడారు. తరువాత పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో 2004లో విడుదలైన తెలుగు కామెడీ-డ్రామా సినిమా ‘గుడుంబా శంకర్(Gudumba Shankar)’. ఈ చిత్రానికి మణి శర్మ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలో ‘కిల్లి కిల్లి కిల్లీ నమిలాకా(KILLI KILLI)‘ అనే పాటకు స్టార్టింగ్ పోర్షన్ పవన్ అందిచారు.
తరువాత సినిమా 2011లో విడుదలైన తెలుగు యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘పంజా(Panjaa)’ . యువన్ శంకర్ రాజా సంగీతం స్వరపరిచిన ఈ చిత్రానికి ప్రత్యేకించి ‘ఎక్కడో పుట్టాడు ఎక్కడో పెరిగాడు(PAPARAAYUDU)‘ అనే పాట బాగా పాపులర్ అయింది. ఈ పాటకి సైడ్ పోర్షన్ పవన్ అందించారు. తరువాత 2013లో విడుదలైన చిత్రం ‘అత్తారింటికి దారేది’. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ నటన, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం మరియు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం హైలెట్ గా నిలిచాయి. ఈ చిత్రంలో పవన్, బ్రహ్మానందంతో చేసే కామెడీలో భాగంగా వచ్చే ‘కాటమ రాయుడా కదిరి నరసింహుడా(KAATAMA RAYUDAA)‘ సాంగ్ ను పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పాడారు.
అలాగే 2018లో విడుదలైన తెలుగు యాక్షన్ డ్రామా చిత్రం ‘అజ్ఞాతవాసి(Agnathavasi)’. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం స్వరపరిచారు. ఇందులో ఉండే ‘కొడకా కోటీశ్వర్ రావా(KODAKAA KOTESWAR RAO)‘ అనే పాటను పవన్ కళ్యాణ్ స్వయంగా పాడారు. ఇవి ఇప్పటి వరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పాడిన పాటల లిస్ట్.
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ సినిమా ను సందర్శించండి.